కొబ్బరికాయని హిందూమతంలో పవిత్ర బలంగా పరిగణిస్తారు. గ్రంథాలలో దీనిని శ్రీఫలం అని అంటారు. అంటే లక్ష్మీదేవికి సంబంధించినది అని అర్థం. అలాంటి కొబ్బరికాయని స్త్రీలు కొట్టకూడదు అని పెద్దలు చెప్తారు దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే అవుననే చెప్తున్నాయి పురాణాలు.
కొబ్బరికాయను బీజఫలంగా భావిస్తారు అందుకే మహిళలు పగలగొట్టకూడదు ఒక స్త్రీ విత్తనం నుండి పిండం గా పెరిగే బిడ్డకు జన్మనిస్తుంది మహిళలు కొబ్బరికాయలు కొడితే బిడ్డకు కష్టాలు తప్పవని నమ్మకం. ఒకసారి విశ్వామిత్రుడికి ఇంద్రుడి మీద కోపం వచ్చి ప్రత్యేక సర్దాన్ని సృష్టించాడు.
కానీ ఆ సృష్టి విశ్వామిత్రునికే నచ్చదు అందువల్ల ప్రత్యేకమైన భూమిని చేయాలని నిశ్చయించుకుంటాడు అప్పుడు కొబ్బరికాయని మానవ రూపంలో సృష్టిస్తాడు అందుకే కొబ్బరికాయని పాత రోజుల్లో మానవ రూపంగా పరిగణించేవారు.
మరో కథనం ప్రకారం విష్ణుమూర్తి భూమి పై అవతరించేటప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు, కామదేనుని కూడా తీసుకు వస్తాడు. కాబట్టి కొబ్బరికాయ లక్ష్మీదేవికి సంబంధించినది అందుకే లక్ష్మీదేవి తప్ప మరొక స్త్రీ కొబ్బరికాయని కొట్టకూడదు అని చెప్తారు. కొబ్బరికాయలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని కూడా చెప్తారు.
అంతేకాదు కొబ్బరికాయని కొట్టడానికి బలం అవసరం స్త్రీలతో పోలిస్తే పురుషులు బలవంతులని ఆ నాటి కాలంలో భావించేవారు అందుకే కొబ్బరికాయలని పురుషులు చేత మాత్రమే కొట్టించేవారు కానీ ఇప్పటి పరిస్థితులు వేరు మహిళలు కూడా పురుషులతో సమానం అనే రోజులు వచ్చాయి.
దీంతో ఇప్పటికే చాలా ఆలయాల్లో మహిళలు సైతం కొబ్బరికాయలని కొడుతున్నారు. అలాగే కొబ్బరికాయ అహంకారానికి కూడా గుర్తు. కొబ్బరికాయని కొట్టడం ద్వారా మనలో ఉండే అహంకారం కూడా అలాగే మొక్కలైపోవాలి అందుకోసమే కొబ్బరికాయని కొడతారు.