ఆడపిల్లలకి పుట్టింటి మీద రాసి ఉండటం సహజం పుట్టింటికి వచ్చిన ప్రతిసారి కంటికి కనిపించిన ప్రతి వస్తువు తన ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అందరూ ఆడపిల్లలు అలా ఉండకపోవచ్చు కానీ చాలామంది అలాగే ఉంటారు.
ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల బాధపడకూడదని ఆమె అడిగిన ప్రతిదీ ఇచ్చి పంపిస్తారు. అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు అని మీకు తెలుసా అలా చేయటం వల్ల పుట్టింటి వాళ్ళు ఇబ్బందులు పాలు అవుతారని తెలుసా.. అవేంటో చూద్దాం రండి.
చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లకి కిరణాసరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో ఉప్పు, చింతపండు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే వీటివల్ల రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి. అలాగే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుంచి పట్టుకు వెళ్ళకూడదు.
ఇలా చేయడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాకుండా పగలు ప్రతీకారాలు కూడా పెరుగుతాయంట. అలాగే చేట, చీపురు కూడా పుట్టింటి నుంచి పట్టుకెళ్లకూడదు. ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు కాబట్టి వీటిని ఆడపిల్ల పట్టుకెళ్ళడం వల్ల పుట్టింటి వారు పేదరికం పాలవుతారని గమనించండి.
అలాగే అగ్గి పెట్టి కూడా పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదు.ఇంకా పుట్టింటి నుంచి నల్ల బట్టలు, నూనె, పాలు, పెరుగు, దూది,గొడుగు,లక్ష్మీ రూపు,విసుర్రాయి, అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్లకూడదు.
నూనె పుట్టినప్పటినుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్ళకి అరిష్టము. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టము. కాబట్టి ఇలాంటి వస్తువులని తెచ్చుకొని వాళ్లని రోడ్డున పడేయటం కన్నా వారి మంచి కోరుకొని వాటిని మనం తెచ్చుకోకపోవడమే ఉత్తమం.