కార్తీక పౌర్ణమి 2023: ఈ రోజు వీటిని దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు

First Published | Nov 27, 2023, 7:30 AM IST

Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమి పండుగ రేపే. ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల జీవితంలోని సకల బాధలు పోతాయనే నమ్మకం ఉంది. మరి ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారనే నమ్మకం ఉంది. 

హిందూ మతంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున గంగానదిలో స్నానమాచరించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే విష్ణుమూర్తికి ఉపవాసం ఉండి పూజిస్తారు. కాగా రేపు కార్తీక పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని అంటారు. మరి ఈ రోజు ఎలాంటి వస్తువులను దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

బట్టల దానం 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ రోజు బట్టలను దానం చేయడం ఎంతో మంచిది. దీనివల్ల మీరు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. బట్టల దానాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. బట్టల దానం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు బట్టల దానాన్ని చేయండి. 

Latest Videos


బెల్లం దానం

కార్తీక పౌర్ణమి నాడు బెల్లం దానాన్ని కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు మీరు బెల్లం దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బుకు కొదవ ఉండదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. 
 

పాల దానం

కార్తీక పౌర్ణమి నాడు పాలను దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. నిజానికి లక్ష్మీదేవికి పాలంటే ఎంతో ఇష్టమట. అందుకే ఈ రోజు మీరు పాల దానాన్ని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. అయితే పాలను సాయంత్రం వేల దానం చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

అన్నదానం

కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం చేయడం ఎంతో శుభప్రదం. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో గొప్పది అనే మాటను వినే ఉంటారు. ఈ రోజు మీరు అన్నదానం చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. శ్రేయస్సు కలుగుతుంది. మీ ఇంట్లో ఆహార పదార్థాలకు ఎలాంటి కొదవా ఉండదు. 

click me!