వసంత పంచమి ఈ రోజే.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

First Published | Feb 14, 2024, 9:26 AM IST

వసంత పంచమి రోజును మతపరంగా ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ రోజు సరస్వతీ దేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందుతారు. మరి ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. 

Basant Panchami

వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుందని, కళా రంగంలోని వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదో రోజున వసంత పంచమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు వసంత రుతువు ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని పనులు చేస్తే సరస్వతీ దేవికి కోపం వస్తుందట. దీంతో అమ్మవారి అనుగ్రహం మీపై ఉండదు. అందుకే ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వసంత పంచమి శుభ ముహూర్తం

మాఘ మాసం శుక్లపక్ష పంచమి తిథి ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 02.41 గంటలకు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12.09 గంటలకు గడువు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. వసంత పంచమి పండుగను ఫిబ్రవరి 14 బుధవారం జరుపుకుంటారు. అలాగే ఈ రోజు సరస్వతీ పూజ శుభ సమయం ఉదయం 07.01 నుంచి మధ్యాహ్నం 12.35 వరకు ఉంటుంది.
 


ఈ పని చేయకండి 

వసంత పంచమి రోజున పూజ చేయకుండా ఏమీ తినకూడదని పండితులు చెబుతున్నారు. లేకపోతే సరస్వతీ మాతకు కోపం వస్తుందట. కాబట్టి వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజించిన తర్వాతే ఏదైనా తినండి. 
 

ఈ పని చేయొద్దు

వసంత ఋతువు రాకను కూడా వసంత పంచమిగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిల మీరు ఈ రోజు చెట్లను, మొక్కలను నరకడం, కట్ చేయడం లాంటివి చేయొద్దు. ఇలా చేయడం చెట్లను అవమానించడమే అవుతుంది. కాబట్టి వసంత పంచమి పర్వదినాన మొక్కలు, చెట్లను నరికేయకండి. 

ఈ రంగు దుస్తులు ధరించకూడదు

పసుపు రంగు సరస్వతీ దేవికి ఇష్టమైన రంగు. అందుకే వసంత పంచమి నాడు మీరు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయండి. దీనివల్ల అమ్మవారు సంతోషిస్తుంది. అలాగే ఈ రోజు ఎట్టిపరిస్థితిలో నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులను వేసుకోవడం మానుకోండి.
 

Vasant Panchami

సరస్వతీ మాతకు కోపం రావొచ్చు

వసంత పంచమి నాడు మాంసం, మద్యం  జోలికి వెళ్లకూడదు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లతో సరస్వతీ మాతకు కోపం రావొచ్చు. అలాగే వసంత పంచమి నాడు ఏదైనా తప్పుడు ఆలోచనను గుర్తుకు తీసుకురావడం లేదా ఒక వ్యక్తిని దూషించడం కూడా సరస్వతీ దేవి అనుగ్రహాన్ని పొందకుండా చేస్తుంది. 

Latest Videos

click me!