వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే ఉంచాలి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్యలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఎక్కడ పెట్టాలి? దీన్ని ఏ సమయంలో కొనాలి? వంటి చీపుర్లకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చీపురును ఎప్పుడూ కూడా దక్షిణ, పడమర దిశల మధ్య స్థలంలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా చీపురును ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కింద పడుకోబెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును వంటగదిలో అసలే ఉంచకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురు పాదాలను అసలే తాకకూడదు. అలాగే చీపురును మురికిగా ఉంచకూడదు. అలాగే సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురును పెట్టడం మంచిది కాదు. జ్యోతిష్యుల ప్రకారం.. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు వరకు చీపురును ఉపయోగించొచ్చు.
Vastu tips of broom
చీపురు ఎప్పుడు కొనాలి?
చీపును కొన్ని సమయాల్లో కొనడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. చీపురును కొనడానికి ఉత్తమ సమయం అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం. అలాగే సోమవారం, శుక్లపక్షంలో చీపురు కొనకూడదని వాస్తుశాస్త్రం కొనడం మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. ఒక వేళ ఈ రోజు చీపురును కొంటే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.