శరన్నవరాత్రులు 2023: నవరాత్రులకు ముందే ఈ వస్తువులను ఇంట్లో నుంచి తీసేయండి..!

First Published | Oct 9, 2023, 3:43 PM IST

నవరాత్రులలో భక్తులు దుర్గామాతను పూజిస్తారు. అయితే నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందే ఇంట్లో నుంచి కొన్ని వస్తువులలను తొలగించాలని పూజారులు చెబుతున్నారు. లేదంటే మీరు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందట. 

శుక్లపక్షం ప్రతిపాద తిథి నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ శుభ సమయంలో అనుకున్నవి జరుగుతాయని నమ్మకం. ఈసారి అక్టోబర్ 15 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర ఆరాధన జగదాంబ మాతకు అంకితం చేయబడింది. నవరాత్రులలో పూజలు, ఉపవాస దీక్షలు చేయడం వల్ల సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందే ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

వెల్లుల్లి, ఉల్లిపాయ

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నవరాత్రుల సమయంలో వెల్లుల్లి ఉల్లిపాయలను తినకూడదు. ఒక వేళ తింటే దుర్గామంది సంతోషంగా ఉండదు. అలాగే మీకు అమ్మవారి అనుగ్రహం కూడా ఉండదు. అందుకే నవరాత్రుల ఉల్లిపాయ, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. 
 


పగిలిన శిల్పాలు

జ్యోతిష్యం ప్రకారం.. మీ ఇంట్లో పగిలిన దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉంటే నవరాత్రులకు ముందే వీటిని ఇంటి నుంచి తొలగించండి. ఎందుకంటే ఈ విగ్రహాలు మీ ఇంట్లో వాస్తు లోపాలను కలిగిస్తాయి. అయితే ఈ విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. వీటిని పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయాలని గుర్తుంచుకోండి.
 

పాత బట్టలు

నవరాత్రులకు ముందే మీ ఇంట్లో ఉండే మురికి బట్టలను, పనికిరాని పాత బట్టలను కూడా ఇంట్లో నుంచి తొలగించండి. ఇవి ఉంటే దుర్గాదేవికి కోపం వస్తుందని చెబుతారు. అందుకే ఇంట్లో చిరిగిన పాత బట్టలను పారేయండి. 

ఎండిన పువ్వులు

మత విశ్వాసాల ప్రకారం.. ఇంట్లో చాలా ఎండిన పూవ్వులు ఉండకూడదు. ఇలాంటి పవ్వులు ఉంటే నవరాత్రులకు ముందే వాటిని బయట వేయండి. ఎందుకంటే ఎండిన పువ్వులు ఇంట్లో ఉండటాన్ని అశుభంగా పరిగణిస్తారు. 

ఉపయోగించని బూట్లు, చెప్పులు

మీరు ఉపయోగించని పాత షూలు, చెప్పులు మీ ఇంట్లో ఉంటే నవరాత్రులకు ముందే వాటిని ఇంట్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఇవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Latest Videos

click me!