Spiritual: మీ పూజగది ఈ దిశలోనే ఉందా.. లేదంటే వాస్తు దోషాలకి గురి అవ్వక తప్పదు?

First Published | Jul 27, 2023, 2:34 PM IST

Spiritual: పూజ కోసం ప్రత్యేకమైన గది ఉండటం శ్రేయస్కరం ఆ గది కూడా ఒక వాస్తు ప్రకారం ఉండాలి లేదంటే వాస్తు దోషానికి ప్రభావితం కావలసి ఉంటుంది. అందుకే పూజ గది గురించిన విశేషాలు తెలుసుకుందాం.
 

 ఏ ఇంటికైనా ప్రత్యేకమైన పూజగదిని కేటాయించాలని మా ఇంటి వారు అనుకుంటారు. అయితే అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. సాధారణంగా దేవుడి గదిని ఇంటికి ఈశాన్యం లేదా తూర్పు లేదా పశ్చిమం దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికి కారణం తెల్లవారుజామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు.
 

 ఈ సమయంలో యోగ ధ్యానం పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి సూర్యుడే లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కుని ఎంచుకోవడం మంచిది. ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్లో స్థలం..
 

Latest Videos


 లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున దేవుడి పటాలను తగిలించి పూజ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ పడక గదులలో పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. పూజ గదికి వాస్తు ప్రకారం తెలుపు లేత పసుపు మరియు నీలం వంటి రంగులని ఉపయోగించాలి.
 

 దేవుడి గదికి నలుపు, నేవీ బ్లూ, వైలెట్ వంటి ముదురు రంగులకు దూరంగా ఉంచాలి. అలాగే పూజగదికి పక్కన టాయిలెట్ లేకుండా చూసుకోవాలి పూజ గాడికి బాత్రూం కి ఒకే కూడా ఉండకూడదు. విగ్రహాలు ఉంటే వాటిని కొంత ఎత్తులో పెట్టుకునే లాగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.

 దేవుళ్ళ విగ్రహాలు 9 అంగుళాల కంటే ఎక్కువ 2 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పూజ గదిలో ఉంచవచ్చు. పూజ గదిలో ఏర్పాటుచేసిన లైట్ రాత్రిపూట కూడా వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. దేవుళ్ళ ఫోటోలు గోడలకు తగలకుండా కొన్ని సెంటీమీటర్ల దూరంలో..
 

 ఉండేలా అలాగే భూమికి కొంత ఎత్తులో ఉండేలాగా పెట్టుకోవాలి. కాబట్టి వాస్తు ప్రకారం పూజ గదిని సర్దుకుంటే పుణ్యము పురుషోర్ధము రెండు కలిసి వస్తాయి లేదంటే వాస్తు దోషానికి గురి కావాల్సి ఉంటుంది.

click me!