Spiritual: పద్మినీ ఏకాదశి రోజు ఇలా చేయండి.. శ్రీమహావిష్ణువుని ఆశీస్సులు పొందండి?

First Published | Jul 25, 2023, 12:49 PM IST

 Spiritual: ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని అంటారు ఆ రోజు చాలా విశిష్టమైనది. అయితే ఈ ఈ సంవత్సరం ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దాని విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

 ఆషాడ మాస శుక్ర పక్షాన వచ్చే ఏకాదశిని పద్మినీ ఏకాదశి అంటారు దీనిని పురుషోత్తమ ఏకాదశి అని సముద్ర ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకి మహా ప్రీతికరమైనది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఏడాది పొడుగునా పుణ్యం లభిస్తుంది.
 

 అయితే 2003లో ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 29న పద్మ ఏకాదశి వ్రతం పాటిస్తారు ఈరోజు ఉపవాసం చేయటం, దానధర్మాలు చేయడం వలన విశేషమైన పుణ్యము లభిస్తుంది.
 

Latest Videos


మిగిలిన మాసాలతో పోలిస్తే ఈ ఉపవాసానికి చేసే పూజకి పదిరెట్లు ఫలితాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం ఆషాడమాస శుక్లపక్షానికి చెందిన పద్మినీ ఏకాదశి జూలై 28న రెండు గంటల 51 నిమిషాలకి ప్రారంభమవుతుంది.
 

మరుసటి రోజు జూలై 29న ఒంటిగంట ఐదు నిమిషాలకి ముగుస్తుంది. కాబట్టి పూజ జూలై 29  పొద్దున్న ఏడు గంటల 22 నిమిషాల నుంచి 94 నిమిషాల మధ్యలో పూజని ప్రారంభించవచ్చు. పద్మిని ఏకాదశి  వ్రత పారాయణం ఉదయం 5:40 నుంచి 8:24 నిమిషాల మధ్యలో ప్రారంభించవచ్చు.
 

ఇక పద్మినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తి శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఈ వ్రతాన్ని మించిన త్యాగము తపస్సు దానధర్మాలు లేవని పురాణాల్లో చెప్పబడింది. ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే లేచి తీర్థ స్నానం చేయాలి.
 

నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయండి కుంకుమ కలిపిన నీటితో విష్ణు కి అభిషేకం చేయండి. ఆ రోజంతా ఉపవాసం చేస్తూ భగవంతుని భజనలు మంత్రాలు చదువుతూ ఉండాలి. ఉపవాస దీక్ష ముగిసిన తరువాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్ష ముగించాలి ఇలా చేయడం వలన  మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది.

click me!