Spiritual: తెలిసి తెలియక పూజ సమయంలో ఇటువంటి తప్పులు చేస్తున్నారా.. అయితే ఈ నియమాలు తెలుసుకోవాల్సిందే?

First Published | Jul 22, 2023, 2:42 PM IST

 Spiritual : పూజలు చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. పద్ధతి ప్రకారం పూజ చేయకపోతే పూజఫలం సిద్ధించదు సరి కదా పాపం చుట్టుకుంటుంది అందుకే పూజా విధానాలు ఎలాగో చూద్దాం.
 

చాలామంది దేవునికి దీపం పెట్టి ఒక అగరబత్తి తిప్పేసి పూజ అయింది అనిపించేస్తారు. కానీ ఈ పూజ చేసే సమయంలో వారికి తెలియకుండానే చాలా తప్పులు చేస్తారు. నిజానికి పూజలు ఒక పద్ధతి ప్రకారం మాత్రమే చేయాలి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చేయాలి.
 

 అలాగే కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి. అదేంటో చూద్దాం. ముందుగా దేవుడికి అర్పించే పువ్వులని చూద్దాం దేవుడికి సమర్పించే పూలు ఎట్టి పరిస్థితులలోనూ కిందన పడకూడదు. కింద పడిన పూలు పూజకి పనికిరావు.
 


అలాగే నైవేద్యం కూడా నిష్ఠతో మడి కట్టుకొని చేయాలి ఒక దేవుడికి పెట్టబోయే  నైవేద్యాన్ని రుచి చూడకూడదు. అలాగే ఒక దీపాన్ని మరొక దీపంతో ఎప్పుడు వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుంది.
 

 అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే దక్షిణ దిశకు ఎదురుగా ఎప్పుడూ దీపాన్ని పెట్టకూడదు. దీపం పెట్టే సమయంలో మనసు దేవుడు పైన లగ్నం చేయాలి. వంట గదిలో వంటకి వాడే పసుపు దేవుడికి వాడకూడదు.
 

పూజ చేసే సమయంలో అతిథులు ఇంటికి వస్తే వారిని గౌరవించాలి ఎందుకంటే ఆ సమయంలో సాక్షాత్తు వారు దైవ స్వరూపులు. అలాగే మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. మీరు పూజలు చేస్తున్నప్పుడు మీ ముఖం పడమర వైపు ఉండాలి. దేవత విగ్రహం ఎదుట ఎప్పుడు వీపు కనిపించేలాగా కూర్చోకూడదు.
 

అలాగే నేల మీద కూర్చొని పూజ చేయకూడదు పూజ చేసే సమయంలో కచ్చితంగా ఆసనం వేసుకొని ఆపై పూజ ప్రారంభించాలి. విష్ణువు గణేశుడు శివుడు సూర్యుడు దుర్గాదేవిని పంచ దేవతలు అంటారు ప్రతిరోజు పూజించేటప్పుడు ఖచ్చితంగా ఈ దేవతలని ధ్యానించాలి. ఇలా చేయడం వలన భగవంతుని అనుగ్రహం సులువుగా కలుగుతుంది అలాగే ఎట్టి పరిస్థితులలోనూ సంధ్యా దీపం తప్పనిసరిగా వెలిగించాలి.

Latest Videos

click me!