ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఈ నాలుగు చోట్ల దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట.
వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. ఫాలో అవుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే.. అన్నీ శుభాలే జరుగుతాయని చాలామంది నమ్మకం. వాస్తు శాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిలో ఒకటి అనుకున్న పనులు జరగడానికి పరిహారం. ప్రతి ఒక్కరూ తమ కోరికలు నెరవేరాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం శనివారం ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయట.
25
శని దేవాలయం
మత విశ్వాసాల ప్రకారం, శనివారం సూర్యాస్తమయం తర్వాత శని దేవుడి గుడికి వెళ్లి దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఆవనూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయట. జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయట.
35
ఇంటి ప్రధాన ద్వారం
శనివారం నాడు ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపున ఒక దీపం వెలిగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయట. అంతేకాకుండా మీ జీవితంలో సంపద, శ్రేయస్సు కలుగుతాయట.
45
హనుమాన్ దేవాలయం
వాస్తు శాస్త్రం ప్రకారం, శనివారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించినప్పుడు మీ కోరికలు నెరవేరడం మొదలవుతుందట. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయట.
55
రావి చెట్టు
వాస్తు ప్రకారం శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, శనివారం ఈ ప్రదేశంలో దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయట.