వైకుంఠ ఏకాదశి తర్వాత.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!

First Published | Jan 9, 2025, 10:13 AM IST

ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి.. ఈ ఏడాది మొదటి శుక్రవారం రోజున వస్తోంది. వస్తూ వస్తూనే.. జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రకాల  రాశులవారికి అదృష్టాన్ని కూడా మోసుకువస్తోంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఓసారి చూద్దాం....
 

వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు మూర్తిని ఏదో ఒక రూపంలో దర్శనం చేసుకుంటే చాలు.. అంతా మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు. అది కూడా ఈ రోజున ఉత్తర దిక్కు నుంచి మాత్రమే స్వామి వారిని చూస్తారు. స్వామి వారి దర్శనం చేసుకోవడంతో పాటు.. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.  ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి.. ఈ ఏడాది మొదటి శుక్రవారం రోజున వస్తోంది. వస్తూ వస్తూనే.. జోతిష్యశాస్త్రం ప్రకారం... కొన్ని రకాల  రాశులవారికి అదృష్టాన్ని కూడా మోసుకువస్తోంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఓసారి చూద్దాం....
 

telugu astrology

1.మేష రాశి.. 
మేష రాశివారికి ఈ వైకుంఠ ఏకాదశి అదృష్టాన్ని తేనుంది.  విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.  ఈ కొత్త సంవత్సరం ఈ రాశివారికి కొత్త అవకాశాలను తెస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు, మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో  పదోన్నతలు పొందుతారు. కొత్త బాధ్యతలు కూడా అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా.. వ్యాయామం, యోగా చేయాలి. ఇవి పాటించడం వల్ల ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. 


telugu astrology

2.కర్కాటక రాశి..
వైకుంఠ ఏకాదశి కర్కాటక రాశి వారికి కూడా శుభం తీసుకువస్తుంది. విజయాలు అందుకుంటారు.  మీ కొత్త ఆలోచనలు, ప్రణాళికలు  ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాపారంలో గొప్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా బాగుంటుంది. మీరు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

telugu astrology

3.తుల రాశి...
వైకుంఠ ఏకాదశి నుంచి  తుల రాశివారికి అదృష్టం దురదృష్టం పట్టినట్లు పట్టుకుంటుంది.  మీ తెలివితేటలు,  నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పని , వ్యాపారంలో విజయం అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ తో పాటు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా కొత్త నిర్ణయాలు తీసుకోగలరు.  విశ్వాసం మీకు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కుటుంబం , స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం,  సమతుల్య ఆహారం మిమ్మల్ని మానసికంగా , శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

telugu astrology

4.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి కూడా వైకుంఠ ఏకాదశి మంచి శుభాలను అందిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు.. విజయం కూడా లభిస్తుంది. మీరు విద్య , పనిలో విజయం సాధిస్తారు, ఈ సంవత్సరం విద్యార్థులకు , వారి కెరీర్‌ను మార్చుకోవాలనుకునే వారికి మంచిది, ప్రణాళికలు , ప్రయత్నాలు విజయవంతమవుతాయి, మతపరమైన, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

telugu astrology

5.మీన రాశి...
మీన రాశివారికి ఏ ఏడాది విష్ణుమూర్తి అనుగ్రహం లభించనుంది.  కొత్త విజయాలు అందుకుంటారు. కెరీర్ ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో పురోగతి, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఆర్థిక లాభాలు, సాంకేతిక,  విద్యా రంగాలలో పురోగతి, కుటుంబ మద్దతుతో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది

Latest Videos

click me!