Garuda Purana
హిందూ పురాణాల్లో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి పుట్టుక నుంచి... చావు తర్వాతి వరకు అన్ని విషయాలను ఈ గరుడ పురాణంలో వివరించారు. మనం జీవితంలో చేసే అన్ని తప్పులకు శిక్ష.. చావు తర్వాత కూడా అనుభవించాల్సి ఉంటుంది. మరి.. అలాంటి శిక్షలు పడకుండా ఉండాలంటే.. జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదు..? ముఖ్యంగా మనం చేసే కొన్ని తప్పులు లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తాయట. దాని వల్ల ఇంట్లోకి కూడా అడుగుపెట్టదట. మరి.. గరుడ పురాణం ప్రకారం చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం...
Garuda Purana
గరుడ పురాణం ఏం చెబుతుంది అంటే...
కుచేలినం దంత మలాప హారిణం
బహ్వాశినం నిష్టుర వాక్వభాషిణమ్
సూర్యోదయ చాప్తమయేచ శాయినం
విముంచతి శ్రీ రపి చక్రపాణినమ్
ఈ శ్లోకం అర్థం ఏమిటంటే.... ‘మలిన వస్త్రమును ధరించిన వానిని, పళ్లు తోమని వానిని, తిండిపోతును, నిష్టురోక్తులాడు వానిని, ఉదయం, సాయంత్రం వేళ నిద్రించు వానిని ఇతర గుణణముల చేత విష్ణు సమానులైనను వీరిని లక్ష్మి పరిత్యంజిను’
మనలో చాలా మంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలని పూజలు చేస్తూ ఉంటాం. దానికంటే ముందు మనం మన బద్దకాన్ని వదిలించుకోవాలట. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఉతుక్కోకుండా మురికి దుస్తులు వేసుకునే అలవాటు ఉన్నవారికీ, ఉదయాన్నే దంతాలు శుభ్రం చేసుకునే అలవాటు ఉన్నవారికీ, తిండి పోతులకీ, ఇతరులపై ఊరికే నిందలు వేసే వారికి, ఉదయం సంధ్యా సమయం వేళలో.. సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించే వేళల్లో నిద్రపోయే వారికి.. లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ లభించదట. వీరిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. అలాంటివారి ఇంట్లో లక్ష్మీ దేవి నిలపడదని గరుడ పురాణం చెబుతోంది. అందుకే.. ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు.
Goddess Lakshmi
ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయమే, సూర్యోదయానికి ముందే కుటుంబసభ్యులందరూ నిద్రలేచి, స్నానాలు ముగించి దైవారాధన, దీపారాధన చేస్తారో, నిత్యమూ ప్రాతఃకాలంలో ఏ ఇంటి వాకిలి శుభ్రపరచి, అలికి ఉంటుందో, ఏ ఇంట్లో వ్యక్తులు ఉదయిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తారో, ఆ ఇంటికి మాత్రమే వస్తుంది సిరులతల్లి లక్ష్మీదేవి.
ఎవరు ఇంట్లో నిత్యం విడువకుండా ఉదయం, సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధన చేస్తారో, ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీకటాక్షం ప్రసరిస్తుంది. దీపారాధనకు అంటే విద్యుత్‌దీపాలు వేయడం కాదు, ఆవునెయ్యి/నువ్వుల నూనెతో వెలిగించిన దీపమే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. అలా కాకా ఏ ఇల్లూ దీపం పెట్టకుండా ఉంటుందో, ఆ ఇల్లు శ్మశానంతో సమానమట. అందుకే అలాంటి ఇంటికి లక్ష్మీదేవి వెళ్లాలి అనుకోదట.
Goddess Lakshmi…
అంతేకాదు.. అనవసరంగా మాట్లాడేవారు, ఇతరులకు సంబంధించిన విషయాల మీద విమర్శిస్తూ కాలక్షేపం చేసేవారు, మద్యపానం, ధూమపానాం, మత్తుపదార్ధాలు స్వీకరించేవారి వద్ద లక్ష్మీ క్షణం కూడా నిలువదు. దొంగలు, మోసగాళ్ళు, అబద్దాలాడేవారంటే లక్ష్మీదేవికి గిట్టదు. ఎవరికీ ఏదీ దానం చేయనివారికి లక్ష్మీదేవీ ఏదీ ఇవ్వదు. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. అమ్మవారి విష్ణుమూర్తిని అస్సలు విడిచిఉండలేదట. అందుకే అమ్మకు నిత్యాన్నపాయిని అని పేరు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, తప్పకుండా విష్ణు మూర్తిని ఆరాధించాలిసిందే. అప్పుడే ఫలితం లభిస్తుంది