ఉత్పన్న ఏకాదశి 2023: ఈ తప్పులు మాత్రం చేయకండి.. లేదంటే ఇబ్బంది పడతారు

First Published | Dec 8, 2023, 11:16 AM IST

Utpanna Ekadashi 2023: ఈ నెల  8వ తేదీ అంటే ఈ రోజే ఉత్పన్న ఏకాదశి పండుగను జరుపుకుంటున్నాం. ఈ ఉత్పన్న ఏకాదశి విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. ఇలాంటి సమయంలో భక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. దీనివల్ల పూజచేసిన ఫలితం కూడా దక్కదు. 

Utpanna Ekadashi 2023: సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసాన్ని ఎంతో పవిత్రంగా, ప్రత్యేకమైందిగా భావిస్తారు.ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని నిష్టగా పూజిస్తారు. ఈ ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఇవి వేటికవే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ రోజు మనం ఉత్పన్న ఏకాదశిని జరుపుకుంటున్నాం. 
 

ఈ ఉత్పన్న ఏకాదశి నాడు చాలా మంది విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం ఉండేవారు విష్ణుమూర్తిని నిర్మలమైన మనస్సుతో నిష్టగా పూజించాలి. అప్పుడే పూజా ఫలితాలు మీకు దక్కుతాయి. అంతేకాదు కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 


ఉత్పన్న ఏకాదశి నాడు ఈ పనులు చేయకండి

మత విశ్వాసాల ప్రకారం.. ఉత్పన్న ఏకాదశి నాడు బియ్యాన్ని తినకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలొస్తాయి. అంతేకాదు దుపరి జన్మ పురుగుల రూపంలో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే ఈ రోజు అన్నాన్ని తినకండి. 
 

ఉత్పన్న ఏకాదశి విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ పవిత్రమైన, ప్రత్యేక దినాన మీరు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మీ భాగస్వామితో ఎట్టిపరిస్థితిలో  శారీరక సంబంధాన్ని పెట్టుకోకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇలాంటి పరిస్థిలో మీరు కోపగించుకోకూడదు. అలాగే ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. సమస్యల గురించి మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. 
 

ఈ రోజు విష్ణుమూర్తికి పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు తామసిక ఆహారాన్ని తినకూడదు. అంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసం వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిని తింటే మీకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. పవిత్రమైన ఏకాదశి నాడు మీరు ఎవరి గురించీ కూడా చెడ్డగా, తప్పుగా మాట్లాడొద్దు. 

Latest Videos

click me!