మార్గశిర్ష అమావాస్య ఎప్పుడు? శుభ సమయం, పూజా విధి మీకోసం..

First Published | Dec 6, 2023, 10:07 AM IST

margashirsha amavasya 2023: పౌర్ణమి, అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే అమావాస్య నాడు చాలా మంది పెద్ద సంఖ్యలో గంగతో సహా పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారు. ఆ తర్వాత విష్ణుమూర్తిని నియమాల ప్రకారం పూజిస్తారు.
 

సనాతన ధర్మంలో పూర్ణిమ, అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూజలు చేయడం, ధ్యానం, దానం చేయాలనే నియమం కూడా ఉంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా గంగా స్నానం చేస్తారు. అమావాస్య, పౌర్ణమినాడు గంగానదిలో స్నానం చేస్తే మనం తెలియకుండా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో ఉంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది గంగా లేదా ఇతర పవిత్రనదుల స్నానమాచరిస్తారు. ఆ తర్వాత విష్ణువును నియమాలప ప్రకారం పూజ చేస్తారు. అమావాస్య నాడు దేవుడి పూజ చేయడం, దానాలు చేయడం వల్ల అమోఘమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు వీటివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. మరి ఈ ఏడాది మార్గశిర్ష అమావాస్య ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

శుభ సమయం

మార్గశిర్ష మాసంలో అమావాస్య డిసెంబర్ 12 న ఉదయం 06:24 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే డిసెంబర్ 13 ఉదయం 05:01 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సనాతన ధర్మంలో ఉదయ తిథికి విలువ ఉంటుంది. కాబట్టి మార్గశిర్ష అమావాస్య డిసెంబర్ 12న వస్తుంది.


మార్గశిర్ష అమావాస్య నాడు ధృతి యోగం ఏర్పడుతుంది. ధృతి యోగం సాయంత్రం 06.52 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే విష్ణువు అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. దీంతో మీకు అంతా మంచే జరుగుతుంది.
 

పూజా విధి

మార్గశిర్ష అమావాస్య నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి విష్ణుమూర్తికి నమస్కరించి రోజును ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు ముగిసిన తర్వాత గంగా నీరు కలిపిన నీటితో స్నానం చేయండి. మీకు అందుబాటులో ఉంటే గంగానదిలో లేదా పవిత్ర నదిలో స్నానం చేయండి. ఈ సమయంలో సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. 
 

నువ్వులను అరచేతిలో ఉంచి ప్రవహించే నీటిలో వదలండి. ఆ తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం విష్ణుమూర్తిని పూజించండి. ఈ సమయంలో విష్ణు చాలీసాను పఠించండి. అలాగే విష్ణు స్తోత్రం, మంత్రాన్ని పఠిస్తే మీకు శుభం కలుగుతుంది. చివరగా హారతి ఇచ్చి సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సంపద వృద్ధి చెందాలని విష్ణుమూర్తిని కోరండి. పూజ తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి దానధర్మాలు చేయండి.
 

Latest Videos

click me!