Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు భక్తులు శ్రీమహావిష్ణువును నిష్టగా పూజిస్తారు. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఏకాదశి తిథి ఉత్తమమైందిగా భావిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీహరిని పూజిస్తారు. అలాగే ఆయనకు ఉపవాసం ఉంటారు. మార్గశిర్ష మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఈ రోజు ఈ దేవుడికి జలాభిషేకం కూడా చేస్తారు.
ఉత్పన్న ఏకాదశి శుభ ముహూర్తం
మార్గశిర్ష మాసంలోని ఏకాదశి తిథి డిసెంబర్ 08 ఉదయం 05.06 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈ ఇది మరుసటి రోజు అంటే డిసెంబర్ 09 ఉదయం 06:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఉత్పన్న ఏకాదశి ఉపవాసాన్ని డిసెంబర్ 08 న ఉంటారు. కాగా ఇదే సమయంలో వైష్ణవులు డిసెంబర్ 9న మహావిష్ణువుకు ఉపవాసం ఉంటారు.
విష్ణువును ఎలా పూజించాలి?
ఈ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉపవాసం పాటించాలి. పూజ చేసేటప్పుడు శ్రీమహావిష్ణువుకు పసుపురంగులో ఉండే స్వీట్లను సమర్పించాలి. ఎందుకంటే పసుపు రంగు శ్రీ హరికి ఇష్టమైనదిగా భావిస్తారు. విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఈ రోజు రావిచెట్టుకు నీటిని సమర్పించండి. ఇది ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఇలా అభిషేకం చేయండి
ఏకాదశి నాడు పచ్చి ఆవుపాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఉత్పన్న ఏకాదశి నాడు దక్షిణ శంఖంలో గంగాజలాన్ని నింపండి. ఈ నీటితో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేయడం వల్ల దేవుడి అనుగ్రహం మీ కుటుంబం మొత్తంపై ఉంటుంది.