Tulsi puja ke niyam
tulsi vivah 2023: సనాతన ధర్మంలో తులసి వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను మనం ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్ల పక్షం రెండో రోజు జరుపుకుంటాం. శ్రీమహావిష్ణువుకు తులసి మాత అంటే ఎంతో ప్రీతిపాత్రమైందని నమ్ముతారు. తులసి మాతను పూజిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తారట. అలాగే దేవుడి కృప మనపై ఉంటుందట. దీంతో మన జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. తులసి వివాహం తేది, శుభ ముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శుభ సమయం
జ్యోతిష్యుల ప్రకారం.. నవంబర్ 23న దేవతాని ఏకాదశి ఉంటుంది. ఈ రోజు లోకాధిపతి అయిన విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అయితే ఏకాదశి తిథి నవంబర్ 23 న రాత్రి 09:01 గంటల వరకు ఉంటుంది.ఆ తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. గతంలో ఏకాదశి, ద్వాదశి తిథి ఒకే రోజు రావడంతో ఈ రెండు పండుగలను కలిపి జరుపుకునేవారు. అయితే ఈ సంవత్సరం ద్వాదశి తిథి నవంబర్ 23 రాత్రి 09:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరురుసటి రోజు అంటే నవంబర్ 24 రాత్రి 07:06 గంటలకు ముగుస్తుంది. అయితే సనాతన ధర్మంలో ఉదయించిన తేదీని పరిగణిస్తారు. కాబట్టి తులసి వివాహం నవంబర్ 24నే జరుపుకుంటారు.
tulsi vivah
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం
సూర్యోదయం - ఉదయం 06:51
సూర్యాస్తమయం - 17:25 గంటలకు
చంద్రోదయం - 03:17 pm
ఉదయం 04:31 గంటలకు సూర్యాస్తమయం
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:03 నుంచి సాయంత్రం 05:57 వరకు
విజయ ముహూర్తం - 01:53 నుంచి 02:36 వరకు
సాయంత్రం ముహూర్తం - సాయంత్రం 05:22 నుంచి 05:49 వరకు
నిషితా ముహూర్తం - 11:41 నుంచి 04:01 వరకు
tulsi vivah
అశుభ సమయాలు
రాహుకాలం - ఉదయం 10:48 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు
గుళిక కాలం - ఉదయం 08:10 నుంచి 09:29 వరకు
దిశ - పడమర