Dev Deepawali 2023: దేవ్ దీపావళి నాడు ఈ పరిహారాలు చేస్తే మీ సిరి సంపదలు పెరుగుతాయి

First Published | Nov 22, 2023, 11:37 AM IST

Dev Deepawali 2023: దేవ్ దీపావళి నాడు ఇంట్లో దీపాలు వెలిగిస్తే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం భక్తులపై ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఈ రోజు ఏం చేయాలంటే? 
 

Dev Deepawali 2023: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి నాడే దేవ్ దీపావళి పండుగను కూడా జరుపుకుంటారు. పూర్ణిమ తిథి ప్రధానంగా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడిందిగా భావిస్తారు. అందుకే ఈ రోజు మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

దేవ్ దీపావళి పేరు ఇలా వచ్చింది?

మత విశ్వాసాల ప్రకారంజ..  శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వదిస్తాడు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలందరూ భూలోకానికి వచ్చి శివుని విజయాన్ని పురస్కరించుకుని దీపాలు వెలిగించి దేవ్ దీపావళి జరుపుకున్నారు. అందుకే కార్తీక మాసంలోని పౌర్ణమిని దేవ్ దీపావళి అని కూడా అంటారు. 
 


దేవ్ దీపావళి ముహూర్తం

కార్తీక మాసం పౌర్ణమి నవంబర్ 26 ఆదివారం మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 27 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. అందుకే  నవంబర్ 26వ న అంటే  ఆదివారం నాడు దేవ్ దీపావళిని జరుపుకోనున్నారు. దీనిని ప్రదోషకాలంలో జరుపుకోవడం పవిత్రంగా భావిస్తారు. దేవ్ దీపావళి శుభ ముహూర్తం సాయంత్రం 05.08 నుంచి 07.47 వరకు ఉంటుంది.
 

ఈ పని ఖచ్చితంగా చేయండి

కార్తీక పౌర్ణమి నాడు గంగా లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానమాచరించండి. సాయంత్రం పూట మట్టి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల భక్తులపై భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ రోజున దీపాలను దానం చేయడం వల్ల కూడా మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 

సుఖసంతోషాలు కలుగుతాయి

దేవ్ దీపావళి నాడు ఒక పిండి లేదా మట్టి దీపం తీసుకొని దానిని నూనె లేదా నెయ్యి వేసి వెలిగించండి. ఆ దీపంలో 7 లవంగాలను వేయండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి దూరంగా ఉంటుంది. దీంతో మీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.
 

ఈ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది

దేవ్ దీపావళి నాడు ఇంట్లో తులసి మొక్కను నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ రోజు తులసి మొక్కను మీ ఇంటికి తీసుకురండి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే ఈ రోజు విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రంపై 11 తులసి ఆకులతో చేసిన దండను వేయండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. 

Latest Videos

click me!