Dev Deepawali 2023 : దేవ్ దీపావళి కరెక్టు తేదీ ఇదే..!

First Published Nov 22, 2023, 10:58 AM IST

Dev Deepawali 2023: కార్తీక పౌర్ణమి నాడు దేవతల దేవుడు మహాదేవుడు త్రిపురాసురుడు అనే అసురుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా స్వర్గంలో దేవతలు దీపం వెలిగించి దేవ దీపావళిని జరుపుకున్నారు. అప్పటి నుంచి దేవ్ దీపావళిని ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. మరి ఈ ఏడాది దేవ దీపావళి ఎప్పుడొచ్చిందంటే? 
 

Dev Deepawali 2023: సనాతన ధర్మంలో దేవ్ దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి ఏడాది కార్తీక మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజే మహాదేవుడు త్రిపురాసురుడు అనే అసురుడిని వధించాడట. ఈ సందర్భంగానే స్వర్గంలో దేవతలు దీపం వెలిగించి దేవ దీపావళిని జరుపుకున్నారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి ఈ దేవ్ దీపావళిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నారు. ఈ పండుగను కార్తీక పౌర్ణమి నాడే జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దేవ్ దీపావళి ఏ రోజు అనే దానిలో కాస్త సందేహం నెలకొంది. కొందరు ఈ పండు నవంబర్ 26న అంటే మరికొందరు 27న అంటున్నారు. పంచాంగం ప్రకారం..  దేవ్ దీపావళి తేదీ, శుభ ముహూర్తం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

శుభ సమయం

పంచాంగం ప్రకారం.. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 26 మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే నవంబర్ 27 మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి నాడే దేవ్ దీపావళిని ప్రదోషకాలంలో జరుపుకుంటారు. అందుకే దేవ్ దీపావళి పండుగ నవంబర్ 26న జరుపుకోబోతున్నాం. ఈ ప్రత్యేక పండుగ సందర్భంగా కాశీలో గంగా హారతిని కూడా నిర్వహిస్తారు. దీన్ని చూడటానికి ఎంతో మంది భక్తులు అక్కడికి వెళతారు. 

ప్రదోష కాలం

జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. దేవ్ దీపావళి రోజున ప్రదోష కాలం నవంబర్ 26 న సాయంత్రం 05:08 నుంచి 07:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దేవ్ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవచ్చు. 
 


సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం

సూర్యోదయం - ఉదయం 06:52

సూర్యాస్తమయం - 17:24 గంటలకు

చంద్రోదయం - సాయంత్రం 04:30

ఉదయం 06:42 గంటలకు సూర్యాస్తమయం
 

బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:04 నుంచి సాయంత్రం 05:58 వరకు

విజయ ముహూర్తం - 01:54 నుంచి 02:36 వరకు

సాయంత్రం ముహూర్తం - సాయంత్రం 05:22 నుంచి 05:49 వరకు

నిషితా ముహూర్తం - రాత్రి 11:42 నుంచి 12:36 వరకు

అశుభ సమయాలు

రాహు కాలం - సాయంత్రం 04:05 నుంచి 05:24 వరకు

గుళిక కాలం - మధ్యాహ్నం 02:46 నుంచి 04:05 వరకు

దిశ - పడమర

click me!