తులసి వివాహం ఈ రోజే.. ఈ ఒక్క వస్తువును మీ గుమ్మానికి కడితే మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదు

First Published | Nov 24, 2023, 4:00 AM IST

Tulsi Vivah 2023 : హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వభావం చంచలమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అమ్మవారు ఎక్కువసేపు ఒకే చోట ఉండదు. అందుకే తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. 

Tulsi Vivah 2023 : ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి రోజున అంటే దేవతాని ఏకాదశి తర్వాతం తులసి వివాహం జరుగుతుంది. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ శుక్రవారం తులసి వివాహం జరగనుంది. తులసి వివాహం ప్రత్యేక సందర్భంలో ఒక్క వస్తువును మీ ఇంటి గుమ్మానికి కడితే పేదరికం ఉండనే ఉండదు. అలాగే మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

తులసి వివాహ ముహూర్తం

కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి నవంబర్ 23 రాత్రి 09:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 24 రాత్రి 07:06 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం.. నవంబర్ 24న తులసి వివాహం జరగనుంది. ఈ సమయంలో ప్రదోష కాలం సాయంత్రం 05.25 నుంచి 06.04 వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలో తులసి వివాహం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


తులసి వేరు

తులసి కళ్యాణం నాడు మీ మెయిన్ డోర్‌ కు తులసి వేరును కట్టండి. ఇది మీ జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాగే మా లక్ష్మి అనుగ్రహం మీ ఇంట్లోని ప్రతి ఒక్కరిపై ఉంటుంది. పేదరికం అనే సమస్యే ఉండదు.

తులసి వేరును..

తులసి కళ్యాణం రోజున తులసి మొక్క వేరును అక్షింతలో కలిపి ఎర్రటి వస్త్రంలో వేసి ముడివేయండి. దీన్ని మీ ప్రధాన ద్వారంపై కట్టండి. దీనితో పాటుగా మీరు ప్రధాన ద్వారంపై లక్ష్మిదేవి పాదముద్రను కూడా వేయొచ్చు లేదా స్వస్తిక చిహ్నాన్ని కూడా తయారు చేయొచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

click me!