తులసి మొక్క హిందువులకు ఎంతో పవిత్రమైనది. దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ఉదయం, సాయంత్రం అక్కడ దీపారాధన చేసి పూజిస్తారు. తులసి మొక్క పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.
సరైన దిశలో, సరైన స్థలంలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. డబ్బు కొరత ఉండదని, ఇంటిల్లిపాది ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి డబ్బు, అదృష్టం కోసం తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.