యానంలో ప్రధాన ఆకర్షణగా ఓవెలిస్క్ టవర్(Obeli tower) ఉంది. ఈ టవర్ నూరు మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ టవర్ పైనుంచి యానంలోను చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడుతుంది ఈ టవర్. ఇక్కడ గోదావరి ఒడ్డున ఏనుగులు శివునికి అభిషేకం చేసేటటువంటి ఏర్పాటుచేసిన విగ్రహాలు (Statues) చాలా అందంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఇది గోదావరి (Godavari) ఒడ్డున చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే గోదావరి ఒడ్డున జీసస్ స్థూపం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడి బాలయోగి బ్రిడ్జి (Balayogi Bridge) రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గోదావరిలో పడవ ప్రయాణం చాలా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పనపల్లిలో (Appanapalli) పరమ పవిత్రమైన దేవాలయం ఉంది.
ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వేల సంఖ్యలో భక్తులు నిత్యం వస్తుంటారు. తిరుమల శ్రీనివాసుడు వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడి శ్రీనివాసుల స్వామి బాల బాలాజీ (Balaji) రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడి దేవాలయంలో శ్రీనివాసులు బాలుని రూపంలో దర్శనమిస్తాడు. ఒక భక్తుని (Devotee) కోరిక తీర్చేందుకు తిరుమల శ్రీనివాసుడు అప్పనపల్లిలో కొలువుతీరాడు.
తనను దర్శించుకోవడానికి తిరుమల (Tirumala) కొండపైకి రాలేని భక్తుని కోరిక తీర్చేందుకు స్వామివారే స్వయంగా వచ్చి దర్శనమిచ్చి భక్తునికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా స్వామి అప్పనపల్లి దేవాలయంలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. దేవాలయం వెనుక భాగంలో గోశాల (Goshala) ఏర్పాటు చేశారు.
స్వామివారి అభిషేకానికి, ప్రసాదానికి అక్కడి నుండే పాలు (Milk) వస్తాయి. యానంలోని ఫ్రెంచి కాథలిక్ చర్చి ఫ్రెంచి పరిపాలనను గుర్తుచేస్తుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి (St. Ann's Catholic Church) అని కూడా పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు జీవన శైలిలో (Life style) నిర్మించబడింది. యానంలో ఉన్న మసీదుకు ఒక ప్రత్యేకత ఉంది.
1848 సంవత్సరంలో మసీదు (Masid) నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మించబడినది. తరువాత 1999 - 2000 సంవత్సరంలో ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు (Festivals) జరుపబడతాయి. ఈ విధంగా అనేక సుందర ప్రదేశాలు యానంలో ఉన్నాయి.