రామేశ్వరం వెళ్తున్నారా అయితే ఈ ప్రదేశాలు అస్సలు మిస్ అవకండి!

First Published Nov 20, 2021, 5:12 PM IST

రామేశ్వరం (Rameshwaram) జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన  ప్రదేశం. రామేశ్వరం భారత దేశానికి దక్షిణ తీరంలో ఉంది. రామేశ్వరం తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబస్ కాలువ ద్వారా వేరు చేయబడింది. భారతదేశంలోని పరమ పవిత్రమైన దేవాలయాల్లో ముఖ్యమైనదిగా ప్రసిద్ధిచెందినది.
 

ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం (Ramanathaswamy Temple) ఉంది. ఇక్కడ ప్రతి అణువు శ్రీ రాముని పాద స్పర్శతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని రాములవారి ప్రాంతంగా చెబుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వస్థలం కూడా ఇదే. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా రామేశ్వరం వెళ్తే తప్పక సందర్శించవలసిన కొన్ని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుందాం..
 

ఇక్కడి రామేశ్వర జ్యోతిర్లింగం ఏడవ జ్యోతిర్లింగం. చార్ ధామ్ (Char Dham) అని చెప్పే పరమపవిత్రమైన క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. తూర్పున పూరీ, పడమర దిక్కున ద్వారకా, ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వర క్షేత్రాలు ఉన్నాయి. కాశీకి (Kashi) వెళదామని వెళ్లక పోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం వెళ్దామని వెళ్లకపోతే మహాపాపమని పెద్దలు చెబుతారు. భగవంతుడు అనుగ్రహించి రామేశ్వరం తీసుకువెళ్లాలని కోరుకోవాలట.
 

దక్షిణాన ఉన్న రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీయాత్రకు (Kashiyatra) సంబంధం ఉంది. కాశీ యాత్ర చేసే వారు కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని అప్పుడే కాశీ యాత్ర పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడ శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకకు చేరాడు. రాముడు నిర్మించిన ఈ సేతువు రామసేతువుగా (Ramasethuvu) పిలువబడుతోంది.
 

రావణాసురుడిని (Ravanasurudu) సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాతకం నిర్మించుకోడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. రామేశ్వరములో అనేక తీర్థ స్థలాలతో పాటు అనేక బీచ్లు (Beaches) ఉన్నాయి. ఇక్కడి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గంధమాదన పర్వతం రామేశ్వరంలోని ఎత్తైన ప్రదేశం. ఈ ప్రదేశంలో రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు నగలు పారవేసిందని చెబుతారు.
 

ఇక్కడి రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, ఇసుకతిన్నెలు, పక్షులు, రామనాథ స్వామి గుడి, ఖండ్రిక గ్రామము, పంబన్ బ్రిడ్జి, గంధమాదన పర్వతం, ధనుష్కోటి, వాటర్ బ్రిడ్జి సాంక్చువరీ, కోదండరామ టెంపుల్, పంచముఖ హనుమాన్ ఆలయం, తీర్థ బావులు తప్పక సందర్శించవలసిన స్థలాలు. వాటర్ బ్రిడ్జి సాంక్చువరీ (Sanctuary) వలస పక్షులకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఇక్కడ వలస పక్షులు (Birds) వచ్చి సందడి చేస్తుంటాయి
 

ఇక్కడి పంబన్ బ్రిడ్జి (Pamban Bridge) ఇండియాలోనే మొట్టమొదటి సముద్ర వంతెనగా ప్రసిద్ధి. ఈ బ్రిడ్జ్ ను పంబస్ ద్వీపానికి రామేశ్వరం పట్టణానికి మధ్య నిర్మించారు. పెద్ద పెద్ద ఓడలు, స్టీమర్ లు వస్తే బ్రిడ్జి రెండుగా విడిపోయి పైకి వెళ్లడం అవి వెళ్ళాక మరలా తిరిగి యథాస్థానంలోకి రావడం ఈ బ్రిడ్జి ప్రత్యేకత (Speciality).

click me!