వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ప్రత్యేకత ఏమిటో తెలుసా?

First Published | Nov 23, 2021, 12:17 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని సిరిసిల్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో వేములవాడ అనే ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం (Rajarajeswaraswamy Temple) ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటి.
 

వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇప్పుడు ఆర్టికల్ ద్వారా వేములవాడలోని  శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం..
 

చాళుక్య రాజులు (Chalukya kings) వేములవాడ ప్రదేశాన్ని రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పాలించినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పురాణ కథనం ప్రకారం అర్జునుడి మునిమనుమడైన నరేంద్రుడు (Narendrudu) ఒక మహాయోగిని చంపడంతో తనకు కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడానికి దేశ యాత్ర చేస్తుండగా ఇక్కడికి వచ్చారని చెబుతారు.
 

Latest Videos


నరేంద్రుడు ఇక్కడి ధర్మ గుండంలో స్నానం చేసి జపం చేస్తున్నప్పుడు ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని కొలను సమీపంలో ప్రతిష్టించి పూజించడంతో శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
 

నరేంద్రుడు ప్రతిష్టించిన ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్ అని చెబుతారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కొలువై ఉన్న స్వామిని రాజరాజేశ్వరస్వామి అని రాజన్న (Rajanna) అనీ అంటారు. మూల విరాట్ కి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు (Statues) మనకు దర్శనమిస్తాయి.
 

ఇక్కడున్న ధర్మ గుండంలో స్నానమాచరించి పునీతులు అయ్యి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ పుణ్యఫలము లభించును. ధర్మగుండం కోనేటి పై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మద్య మండపంపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది.
 

ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ సంతానంలేనివారు కోడె మొక్కులు మొక్కుతారు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదర్శన చేయించి ప్రాంగణంలో కట్టేస్తారు. ఈ గిత్తలను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. ఇలా చేయడంతో వారికి సంతాన ప్రాప్తి (Parental access) కలుగుతుందని నమ్మకం.
 

పరమపవిత్రమైన గండ దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం (Virtue) కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఇక్కడ జరిగే శివరాత్రి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజున సుమారు వందమంది అర్చకులతో మూలవిరాట్టుకి మహాలింగార్చన జరుపుతారు.  
 

అర్ధరాత్రి వేళ శివునికి ఏక రుద్రాభిషేకం చేస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ముస్లిం మతానికి చెందిన ఒక భక్తుడు గుడిలో స్వామిని సేవిస్తూ ఉండగా ఇక్కడే  మరణించారట. అతని గుర్తుగా ఈ మసీదు నిర్మించారు.బౌద్ధులు, జైనులు, వైష్ణవులు అందరూ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు.
 

జైన, బౌద్ధ సంస్కృతులను (Cultures) ప్రతిబింబించే శిల్పాలు (Sculptures) ఈ దేవాలయం పై ఉన్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భారత దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

click me!