షిరిడి వెళితే తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశాలు ఇవే!

First Published Dec 1, 2021, 4:05 PM IST

మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్ నగర్ (Ahmed nagar) జిల్లా నుండి 85 కిలోమీటర్ల దూరంలో షిరిడి ఉంటుంది. షిర్డీలో శ్రీ షిర్డీ సాయిబాబా పుణ్య క్షేత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుండి అనేక వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా షిరిడి వెళ్తే తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో గురించి తెలుసుకుందాం.. 
 

షిర్డీలో (Shiridi) అనేక సందర్శనీయ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి. అజంతా ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర్, హిల్ స్టేషన్లు బీచ్ లు, కోటలు, వన్యప్రాణుల అభయారణ్యాలను షిర్డీ వెళ్తే చూడవచ్చు. షిర్డీలో ప్రతి అణువు సాయి బాబా పాద స్పర్శతో నిండి పరమ పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు షిర్డీ వెళితే తప్పక సందర్శించవలసిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

ప్రధాన దేవాలయం:  నాగపూర్ (Nagpur) కు చెందిన ఒక కోటీశ్వరుడు శ్రీకృష్ణుని కోసం ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించడానికి మొదలు పెట్టాడు. కానీ 1918లో సాయిబాబా దైవ సాన్నిహిత్యం పొందడంతో ఆయన అస్థికలు (Ashes) గుడిలో పెట్టడం జరిగింది. ఈ విధంగా శ్రీ కృష్ణుని కోసం నిర్మించబడిన దేవాలయం షిర్డీ సాయిబాబా దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 
 

ద్వారకామాయి: ద్వారకామాయి (Dwarakamai) షిర్డీ దేవాలయం ప్రవేశం వద్ద ఉన్న ఒక మసీదు (Mosque). ఈ ప్రదేశంలో బాబా ఎక్కువ కాలం గడిపాడు. ఈ ప్రదేశంలో సాయంత్ర వేళలో సాయిబాబా దీపాలు వెలిగించేవారు. ఇక్కడ బాబా చిత్రపటం, బాబా కూర్చోడానికి వాడిన పెద్ద బండరాయి, పల్లకి భక్తులకు దర్శనమిస్తాయి.
 

చావడి: ఇది ఒక చిన్న ఇల్లు. ద్వారకామాయి మసీదుకు దగ్గరలో ఉండేది చావడి (Chavadi). బాబా రోజు విడిచి రోజు ఇక్కడ నివాసం ఉండేవారు. ఈ చిన్న ఇంట్లో బాబా వాడిన చెక్క మంచం, కుర్చీలు పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఇవి చావడి ఆకర్షణలు (Attractions). ద్వారకామాయి నుంచి చావడికి బాబాను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. 
 

గురుస్తాన్: మొట్టమొదటిసారిగా బాబాను గురుస్తాన్ (Gurustan) ప్రదేశంలో చూడడం జరిగింది. గురుస్తాన్ అనేది వేపచెట్టు (Neem tree) ప్రదేశం. భక్తులకు బాబా దర్శనం మొదట ఇక్కడే జరిగింది. ఇక్కడ అగరబత్తులు వెలిగిస్తే అన్ని రకాల రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. 
 

ఖండోబా దేవాలయం: ఇది ఒక పురాతన దేవాలయం. షిర్డీ లోని అహ్మద్ నగర్ - కోపెర్ గాన్ రోడ్డు మార్గంలో ఖండోబా దేవాలయం (Khandoba Temple) ఉంది. ఇది ఒక శివాలయం. ఈ శివాలయం పూజారి బాబాను ఓం సాయి (Om Sai) అని పిలిచేవారట.
 

లెండివనం (Lendivanam): లెండిబాగ్ లో బాబా తరచూ ధ్యానం చేసేవారు. ప్రతి రోజు మట్టి ప్రమిదలో దీపం వెలిగించే వారు. ఇక్కడ బాబా ఒక మర్రి చెట్లు నాటారు. ఈ మర్రిచెట్టు (Banyan tree) కింద అఖండజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ వన సందర్శనం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
 

శని శింగనాపూర్: షిర్డీకి 73 కిలోమీటర్ల దూరంలో శని శింగనాపూర్ (Shani Shingnapur) ఉన్నది. ఇక్కడ శని దేవుని ఆలయం ప్రసిద్ధి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత ఏమిటి అంటే ఏ ఇంటికి తలుపులు పెట్టరు (Doors do not close). ఎవరైనా దొంగతనం చేస్తే ఆ రోజే వారు గుడ్డి వారైపోతారని అక్కడి స్థానికులు చెబుతారు.
 

నాసిక్: షిర్డీకి 87 కిలోమీటర్ల దూరంలో నాసిక్ (Nashik) ఉంది. ఈ ప్రదేశాన్ని పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంత కాలానికి గడిపినట్లు చెబుతారు. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు సూర్పనఖ (Surpanakha) ముక్కు కోశాడని ఆ కారణంగానే దీనికి నాసిక్ అనే పేరు వచ్చినట్లు కథనం.
 

ఇలా ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు షిర్డీ చుట్టూ ఉన్నాయి. షిర్డీ వెళ్ళినప్పుడు వీటిని తప్పక సందర్శించండి. ఈ యాత్ర మీకు ప్రశాంతతను కలుగజేస్తుంది.

click me!