బొటానికల్ గార్డెన్స్: ఊటీలో తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశంగా బొటానికల్ గార్డెన్స్ ఉంది. ఈ గార్డెన్స్ 1848లో నిర్మించబడ్డాయి. బొటానికల్ గార్డెన్స్ (Botanical Gardens) అందమైన పువ్వులు, ఫెర్న్స్, ఆర్కిడ్లు వివిధ అద్భుతమైన అందాలతో నిండి చూసేందుకు కనులవిందుగా ఉంటుంది. ఈ అద్భుతమైన తోటలు పర్యాటకుల మనసుకు ఆహ్లాదాన్ని (Enjoy) కలిగిస్తాయి.
టాయ్ ట్రైన్: ఊటీలో ప్రధాన ఆకర్షణగా టాయ్ ట్రైన్ (Toy train) ఉంది. ఇది ఒక అందమైన బొమ్మ రైలు. 1899 సంవత్సరంలో ఈ ట్రైన్ ను ప్రారంభించారు. ఈ ట్రైన్ నీలగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్ (Nilgiri Mountain Railway Toy Train) అని పిలువబడుతోంది. ఈ అందమైన ట్రైన్ లో కూర్చొని అడవి, సొరంగాలు, పొగమంచు, పక్షుల మధ్య ప్రయాణం చేస్తుంటే ఈ ప్రయాణం మనకు ఒక మధురానుభూతిని అందిస్తుంది.
దొడ్డబెట్ట శిఖరం: ఊటీలో ఉన్న అతి ఎత్తైన శిఖరంగా దొడ్డబెట్ట శిఖరం (Doddabetta) ఉంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి (Sea level) 2,623 మీటర్ల ఎత్తులో ఉంది. ఊటీకి వెళ్ళినపుడు ఈ శిఖరాన్ని తప్పక సందర్శించండి.
కామ్‌రాజ్ సాగర్ సరస్సు: ఊటీ శివార్లలో కామ్‌రాజ్ సాగర్ సరస్సు (Kamraj Sagar Lake) ఉంది. ఈ సరస్సు అనేక రకాల మూలికలు (Herbs), పొదలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి స్థానిక వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఊటీ సందర్శనలో భాగంగా ఈ సరస్సును తప్పక సందర్శించండి.
కోటగిరి హిల్ స్టేషన్: ఊటీ అతి పెద్ద హిల్ స్టేషన్ గా ఉంటే దాని తరువాత రెండవ స్థానంలో కోటగిరి హిల్ స్టేషన్ (Kotagiri Hill Station) ఉంది. ఇది ట్రెక్కింగ్ (Trekking) చేసే పర్యాటకులకు ఉత్తమైన ప్రదేశంగా ఉంది. ఈ హిల్ స్టేషన్ సందర్శన పర్యాటకులకు తప్పక నచ్చుతుంది.
అన్నామలై ఆలయం: ఊటీకి 20 కిలోమీటర్ల దూరంలో అన్నామలై ఆలయం (Annamalai Temple) ఉంది. కొండ పైభాగంలో ఉన్న ఒక వేదశాలకు (Theology) కూడా ఇది కేంద్రంగా ఉంది. ఊటీలో తప్పక సందర్శించవలసిన జాబితాల్లో ఈ ఆలయం ఉంది.
సెయింట్ స్టీఫెన్స్ చర్చి: నీలగిరిలో అతి పురాతనమైన చర్చలలో ఒకటిగా సెయింట్ స్టీఫెన్స్ చర్చి (St. Stephen's Church) ఉంది. ఈ ఆంగ్లికన్ కేథడ్రల్ (Anglican Cathedral) 1829లో ప్రారంభమైంది. ఈ చర్చిలో అందమైన గాజు చిత్రలేఖనాలు, చెక్క పనులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఈ చర్చి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.