శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షం పొందాలంటే చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 24, 2021, 10:31 AM IST

శుక్రవారం (Friday) రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అప్పుడే ఆ కుటుంబం అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉంటారు. అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలాగే కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం (Lakshmidevi grace) మన మీద ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.  

PREV
19
శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షం పొందాలంటే చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో తెలుసా?

శుక్రవారం రోజు చేయవలసిన పనులు: శుక్రవారం రోజున మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం (Head bath) చేసి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. పూజా విధానాలు ఆచరించి, తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపారాధన (Deeparadhana) చేయాలి.
 

29

ఇలా చేస్తే సుమంగళి ప్రాప్తిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. అలాగే అమ్మవారికి తెల్లపువ్వులు (White flowers) సమర్పించడంతో ఇంటిలో ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా (Healthy) ఉంటారు. తెల్ల పూలను మహిళలు ధరించడంతో శుభఫలితాలు లభించును.
 

39

శుక్రవారం రోజున పాలతో (Milk) పాయసం తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. ఆలయాల్లో ఇచ్చే పసుపు, కుంకుమలను నుదుట పెట్టుకోవడంతో దుష్ట శక్తులు దరిచేరకుండా పాజిటివ్ ఎనర్జీ (Positive energy) వస్తుంది. అంతా మంచే జరుగుతుంది.
 

49

శుక్రవారం రోజున గణపతి ఆలయాన్ని (Ganapati Temple) దర్శించుకుని గణపతికి గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలు (Desires) నెరవేరుతాయి. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకు వెళితే అన్ని కష్టాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది.     
 

59

శుక్రవారం రోజున మహిళలు సాంప్రదాయ దుస్తులను (Traditional dress) ధరించడం మంచిది. శుక్రవారం రోజున ఉదయం కానీ, సాయంత్రం కానీ దేవాలయాలను దర్శిస్తే శుభం కలుగుతుంది. శుక్రవారం రోజున చేసే పూజల ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది. అన్ని కష్టాలు (Difficulties) తొలగిపోతాయని పెద్దల నమ్మకం.
 

69

శుక్రవారం రోజున చేయకూడని పనులు ఏమిటి: శుక్రవారం రోజున బూజు దులపడం (Mildew) వంటి పనులు చేయరాదు. అలాగే శుక్రవారం రోజున ఇతరులకు డబ్బులు (Money) ఇవ్వరాదు. అయితే ఇది వైద్య, విద్యారంగ వ్యవస్థకు సంబంధించదు.
 

79

మగవారు, ఆడవారు జుట్టు కత్తిరించడం (Hair cutting), గోళ్ళు కత్తిరించడం (Trimming nails) చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండదు. అలాగే శుక్రవారం రోజు ఆలయానికి వెళ్లి దీపారాధన చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 

89

ఆలయాల్లో దీపాలు (Deepalu) వెలిగించేటప్పుడు ఇతరుల అగ్గిపెట్టెతో (Matchbox), ఆలయాల్లోని దీపాలతో వెలిగించరాదు. ఇలా చేసి పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు దక్కుతుంది. శుక్రవారం రోజున మాసినబట్టలను ధరించడం, ముట్టడం వంటి పనులు చేయరాదు.
 

99

అలాగే బంగారు ఆభరణాలను (Gold jewelry) తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం (Lakshmidevi grace) మనమీద ఉండదు. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పొరపాటున కూడా శుక్రవారం రోజున ఈ పనులను అస్సలు చేయకండి.

click me!

Recommended Stories