ఆంధ్రాలో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published | Oct 31, 2021, 5:42 PM IST

భారత దేశంలోని (India) అతిపెద్ద రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతి పరిధిలో విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అమరావతిగా పిలుస్తారు. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఈ ఆర్టికల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

తిరుపతి: తిరుపతి (Tirupathi) ఆంధ్రప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరం. ప్రధాన సాంస్కృతిక, ఆధ్యాత్మికమైన యాత్రా స్థలాల్లో తిరుపతి ఒకటి. తిరుపతిలోని దేవాలయాలు, పార్కులు (Parks), జంతుప్రదర్శనశాలు వంటి వివిధ ఇతర ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుపతి నుంచి తిరుమల కొండలపై ఎక్కవలసి ఉంటుంది.
 

భారత దేశంలోని అన్ని ప్రాంతల ప్రజలు ఈ స్వామిని దర్శించుకునేందుకు వస్తారు. ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు శ్రీ వెంకటేశ్వర ఆలయం (Sri Venkateswara Temple), తలకోన జలపాతం (Talakona Falls), టిటిడి గార్డెన్స్, డీర్ పార్క్, మ్యూజియం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం. మరిన్ని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. 
 

Latest Videos


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మూడవ అతిపెద్ద నగరం విజయవాడ (Vijayavada). విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. వివిధ దేవాలయాలు, మత కట్టడాలు, నదులు, పురాతన గుహలు (Caves) మరెన్నో సాంస్కృతిక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
 

విజయవాడలో చూడవలసిన ప్రదేశాలు ప్రకాశం బ్యారేజ్, భవానీ ద్వీపం, మొగల్రాజపురం గుహలు, విక్టోరియా మ్యూజియం (Victoria Museum) కొండపల్లి కోట, కొల్లేరు లేక్ (Kolleru lake) మహాత్మా గాంధీ హిల్ మరిన్ని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించాయి.
 

అనంతపురము: ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలలో అతి పెద్దదైనది అనంతపురము (Anantapuramu). అనంతపురము పట్టణంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెట్లుగా తిమ్మమ్మ మర్రిమాను (Thimmamma Marrimanu) ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కొండ, కోటలు, పురాతన శిథిలాలు, రహస్య జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
 

అనంతపురంలో చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ధర్మవరం (Dharmavaram), ఆలూరు కోన, లేపాక్షి (Lepakshi), రాయదుర్గం ఫోర్ట్ పెనుగొండ గుత్తి కోట తిమ్మమ్మ మర్రిమాను. ఇవి అనంతపురం వెళ్ళినప్పుడు మనం తప్పకుండా దర్శించవలసిన ప్రదేశాలు.
 

అమలాపురం: అమలాపురం (Amalapuram) కొబ్బరి, బియ్యం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇది ఒక చిన్న పట్టణం. ఇక్కడ ఎన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. అమలాపురంలో చూడవలసిన ప్రదేశాలు అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం, శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం, మురాముల్లా, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అప్పనపల్లి ఆలయం (Appanapalli).
 

పుట్టపర్తి: పుట్టపర్తిలో (Puttaparthi) సత్యసాయి బాబా ప్రధాన మతపరమైన కేంద్రాలలో ఒకటి. సాయి బాబా ఆశ్రమానికి సేవలు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు వస్తారు. ఇక్కడ సాయిబాబా ఆశ్రమం ఆధ్వర్యంలో ఎన్నో సందర్శక సాంస్కృతిక (Cultural) కార్యకలాపాలు ఉన్నాయి.
 

పుట్టపర్తిలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సాయి కుల్వంత్ హాల్ (Sai Kulwant Hall), చైతన్య జ్యోతి మ్యూజియం (Chaitanya Jyoti Museum), శ్రీ సత్య సాయి స్పేస్ థియేటర్, శ్రీ సత్య సాయి హిల్ వ్యూ స్టేడియం, ఆంజనేయ హనుమాన్ స్వామి ఆలయం, విలేజ్ మసీదు, చిత్రావతి నది

click me!