దసరా రోజున ఇవి మాత్రం దానం చేయకండి..!

First Published | Oct 9, 2024, 10:07 AM IST

పండగ రోజున దానధర్మాలు చేసే ముందు కాస్త ఆలోచించాలట.ఎందుకంటే.. తెలిసీ తెలీక.. ఏది పడితే అది.. దానం చేయకూడదట. నిజానికి దానం చేయడం పుణ్యకార్యమే కానీ..  ఏవి పడితే అవి చేయకూడదు.ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం....

హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్ల పక్ష దశమి తిథి రోజున దసరా పండగను జరుపుకుంటారు. సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని.. రాముడు ఈ రోజే అంతమొందించాడు. ఆ నాటి నుంచి మనమంతా ఈ విజయదశమి పండగను జరుపుకుంటూ వస్తున్నాం. ఈ పండగ రోజున ప్రజలు.. దేవాలయానికి వెళ్లి.. దేవుడి దర్శనం చేసుకుంటారు. అంతేకాదు... ఆయుధ పూజ కూడా చేసుకుంటారు. ఆయుధాలను పూజించడం అంటే... దుష్టశక్తులు నశిస్తాయని నమ్ముతారు. అయితే... పండగ కదా అని చాలా మంది ఈ పర్వదినాన ఎక్కువ మంది దానధర్మాలు చేస్తూ ఉంటారు.కానీ.. పండగ రోజున దానధర్మాలు చేసే ముందు కాస్త ఆలోచించాలట.ఎందుకంటే.. తెలిసీ తెలీక.. ఏది పడితే అది.. దానం చేయకూడదట. నిజానికి దానం చేయడం పుణ్యకార్యమే కానీ..  ఏవి పడితే అవి చేయకూడదు.ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం....


1.తోలు వస్తువులు...
హిందూ మతంలో  జంతువులను చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. తోలు వస్తువులను జంతువుల చర్మం నుంచి తయారు చేస్తారు. కాబట్టి.. వాటిని దానం చేయడం.. ఆ జంతువుల పట్ల  గౌరవం చూపడం లేదనే భావన కిందకు వస్తుంది. అందుకే.. దసరా వంటి పవిత్రమైన పండగ రోజున తోలు వస్తువులను దానం చేయడం.. అపవిత్రమైనదిగా పరిగణిస్తారు.  అందుకే.. అలాంటి వస్తువులు దానం చేయడం మంచిది కాదు.
 


2.పదునైన వస్తువులు..

పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో అసమ్మతి, ఉద్రిక్తత , అసమ్మతి ఏర్పడుతుందని నమ్ముతారు. ఈ విషయాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాన్ని పాడు చేయగలవని నమ్ముతారు. పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో ధన నష్టం కలుగుతుంది. ఈ విషయాలు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి. సంపద ఇంట్లో నుండి పారిపోతుందని నమ్ముతారు. పదునైన వస్తువులు అశుభమైనవిగా పరిగణిస్తారు. వాటిని దానం చేయడం లేదా స్వీకరించడం అశుభంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
 

3.పసుపు దానం...

పసుపు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. సాయంత్రం పూట పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి గ్రహం బలహీనపడుతుందని, ఇది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. సాయంత్రం పూట పసుపును దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.  ఇంట్లో ఇబ్బందులను కలిగిస్తుంది. పసుపును శుభప్రదంగా భావిస్తారు, కానీ సాయంత్రం దానం చేయడం అశుభ శకునంగా పరిగణిస్తారు.
 

Latest Videos

click me!