1.కాకి కి ఉన్న అద్భుతమైన సామర్థ్యం..
కాకి కి ఏ విషయం అయినా ముందుగానే తెలిసిపోతుందట. కనీసం మూడు నెలలు ముందుగానే ప్రకృతిలో జరిగే మార్పులు కూడా కాకికి తెలిసిపోతాయట. మన పూర్వీకులు కాకుల ద్వారా మమ్మల్ని సంప్రదించి రాబోయే సంఘటనల గురించి చెప్పేవారని నమ్మేవారట.
2.కాకులు గొడవలు పడితే అర్థమేంటి?: మీ ఇంట్లో కాకుల గుంపు వచ్చి కూర్చుని తమ మధ్య గొడవలు పెట్టుకుంటే ఇంటి యజమానికి ఇబ్బంది తప్పదని అర్థం చేసుకోవాలి.
కాకి ఎటు నుంచి అరుస్తుంది..? : మధ్యాహ్నానికి ముందు, మీరు తూర్పు లేదా ఉత్తర దిశలో చెట్టుపై కూర్చున్న కాకి స్వరం వింటే, మీ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇది భార్య నుండి పొందిన ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు.