శ్రావణ మాసంలో శివుడికి అస్సలు సమర్పించకూడనివి ఇవే...!

First Published | Jul 29, 2024, 11:42 AM IST

కొన్ని వస్తువులను శివయ్యకు సమర్పించడం వల్ల.. మనకు మేలు జరగకపోగా.. ఆ శివయ్య ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట. 

శ్రావణమాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసంలో దాదాపు అందరూ మాతా లక్ష్మీదేవిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.  కానీ... ఈ శ్రావణమాసంలో ఆ శివయ్యను కూడా మనం పూజించాలి. ఈ మాసంలో..  మనం శివయ్యను పూజించడం వల్ల  వారు కోరుకున్న అన్ని జరుగుతాయట. అయితే... శివయ్యను పూజించే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం చేయకూడదట. అంటే.. కొన్ని వస్తువులను శివయ్యకు సమర్పించడం వల్ల.. మనకు మేలు జరగకపోగా.. ఆ శివయ్య ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందట. అందుకే.. శివయ్యకు కొన్ని వస్తువులు.. అస్సలు సమర్పించకూడదు. అవేంటో తెలుసుకుందాం...
 

tulsi

1.తులసి...
తులసిని మనం చాలా పవిత్రమైనది గా భావిస్తాం. చాలాసార్లు పూజకు మనం తులసి ని వాడుతూ ఉంటాం. కానీ.. తులసి ఆకులను శివయ్యకు మాత్రం సమర్పించకూడదట. హిందూ గ్రంధాల ప్రకారం, తులసి రాక్షస రాజు జలంధరకు  భార్య అట.  విశ్వాన్ని రక్షించడానికి శివుడు జలంధరను నాశనం చేసినప్పుడు, తులసి... ఆగ్రహించిందట. శివయ్యను తన ఆకులతో ప్రజలు పూజించకూడదని ఆమె శపించిందట. అందుకే.. మనం శివయ్యకు తులసిని సమర్పించకూడదు.


2.పసుపు...

పసుపు మనం చాలా సాధారణంగా పూజలకు వాడుతూ ఉంటాం. పసుపును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటాం.  చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గదించడంలోనూ పసుపు మనకు ఉపయోగపడుతుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ పసుపు శివయ్యకు మాత్రం సమర్పించకూడదట. ఎందుకంటే.. శివుడుని సన్యాసిగా చెబుతూ ఉంటారు. ప్రాపంచిక సుఖాలకు శివుడు దూరంగా ఉంటాడు. పసుపు సంతానోత్పత్తి, వివాహంతో ముడిపడి ఉంటుంది. అందుకే.. ఈ లక్షణాలు శివయ్యకు సరిపోలవు. ఈ కారణంతోనే శివయ్యను పసుపుతో పూజించరు.
 

3.కుంకుమ..

మీకు నమ్మసక్యంగా లేకపోయినా... కుంకుమను కూడా శివయ్యకు సమర్పించకూడదట. వివాహిత స్త్రీలు... సింధూర్ ని నుదుటిన ధరిస్తూ ఉ:టారు. నుదిటిపై ఉన్న కుంకుం ఒక స్త్రీ వివాహితురాలు అని సూచిస్తుంది.  కానీ.. శివయ్యకు మాత్రం సమర్పించకూడదు.  ఎందుకంటే పసుపు మాదిరిగానే, కుంకుమ సంతానోత్పత్తి, వైవాహిక స్థితి, శుభప్రదానికి సంబంధించినది. ఇది తరచుగా శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దేవతలు , దేవతల ఆరాధనలో ఉపయోగిస్తారు. శివుడు, నిర్లిప్తతకు చిహ్నంగా, ఈ సంఘాలలో పడడు. శివునికి కుంకుడు సమర్పించడం అనుచితమైనదిగా పరిగణిస్తారు. ఆయన కుంకుమకు బదులు.. బస్మాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.


4. కాంస్య కుండలో నీరు

శివలింగానికి నీరు , గంగాజలం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అభిషేకం సమయంలో, శివునికి గంగాజల్, తేనె, పెరుగు, పంచామృతం, మరెన్నో సమర్పిస్తారు. కానీ, వారు శివలింగానికి ఎప్పుడూ కాంస్య పాత్రలో నీటిని సమర్పించకుండా చూసుకోవాలి. ఇలా చేయడం అశుభం అని భావిస్తారు. కాబట్టి.. రాగి, వెండి లేదా మట్టి కుండలను ఉపయోగించడం ఉత్తమం.

Latest Videos

click me!