గుడిలో గంట ఎందుకు కొడతారు..? ఆగమ శాస్త్రం ఏం చెబుతోంది..?

First Published | Jul 29, 2024, 10:48 AM IST


గుడిలో మనం గంట కొట్టడం అంటే... దేవతలను ఆహ్వానించడం అని అర్థమట.  ఈ ఘంటానాదానికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంటుంది. 

మన దేశం సంస్కృతి సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా  మన దేశంలో దేవాలయాలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. క్రమం తప్పకుండా మనమంతా గుడికి వెళ్తూనే ఉంటాం. అయితే.. గుడిలోకి అడుగుపెట్టగానే.. కామన్ గా భక్తులంతా చేసే పని ఏంటి..? గంట కొట్టడం.  కానీ.., ఎప్పుడైనా అసలు గంట ఎందుకు కొట్టాలి..? అనే విషయం గురించి ఆలోచించారా..? గుడిలో గంట ఉంది కొట్టాం అనుకుంటారు కానీ...అసలు గుడిలో  గంట ఎందుకు పెడతారు..? దానిని ఎందుకు కొట్టాలి అనే విషయం మాత్రం చాలా మంది ఆలోచించరు.

గుడిలో మనం గంట కొట్టడం అంటే... దేవతలను ఆహ్వానించడం అని అర్థమట.  ఈ ఘంటానాదానికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంటుంది. 
ఘంటనాద మంత్రం: 
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం.... కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం 
 

Latest Videos



గుడిలో మొదట అర్చకులు చేసే పని ఇదే....
సాధారణంగా గుడిలోకి అర్చకులు మొదట అడుగుపెట్టగానే ఘంటానాదం చేస్తారట.  అంటే.. పైన చెప్పిన మంత్రాన్ని చదువుతారు. దాని అర్థమేంటంటే... స్వామి, అమ్మవార్లకు.. తాము పూజ చేయడానికి వచ్చామని.. దేవతలందరూ కూడా  అక్కడకు రావాలని ఆహ్వానించడమేనట. దానికోసమే.. ఘంటానాదం చేస్తారు.
 

గుడిలో  గంట ఎన్నిసార్లు కొట్టాలి..?
ఇక.. గుడిలో గంటను ఎన్నిసార్లు కొట్టాలి అనే విషయం చాలా మందికి తెలీదు.  కానీ.. గుడిలో గంటను కేవలం మూడుసార్లు మాత్రమే కొట్టాలట.  అది కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా కొట్టాలి. అప్పుడు మనకు ఓం అనే శబ్దం వినపడుతుంది. ఆలయాలకు వెళ్లి ఏ భక్తులైన గుడిలో గంటను మూడుసార్లు మాత్రమే కొట్టాలి. దీని అర్థం సృష్టికి మూలమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించడం అని వేద పండితుల వివరణ. స్వామివారికి హారతిస్తున్నప్పుడు మాత్రం అర్చకుల అనుమతితో కంటిన్యూగా గంట కొట్టవచ్చని ఆగమ శాస్త్రం చెబుతోంది. 

అయితే.. కేవలం శాస్త్రీయ కోణం మాత్రమే కాదు...  సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది..
సాధారణంగా గుడిలోని అన్ని గంటలు కంచుతో తయారు చేసి ఉంటాయి. ఈ లోహంతో తయారు చేసిన గంటను మనం మోగించడం వల్ల... ఓంకారం శబ్దం చాలా ఎక్కువ దూరం వినపడుతుంది.  కంచు వస్తువుతో చేసినట్లు వచ్చే శబ్దం మరే వస్తువుతో చేసినా రాదు.  మనం ఒక్కసారి గంట కొట్టడం వల్ల 432 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ  రిలీజ్ అవుతుంది.  దీని కారణంగా.. ఆ పరిసరాల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అంతేకాదు.. ఘంటానాదం చేయడం, వేద మంత్రాలు పటించడం వల్ల కూడా... పాజిటివ్ ఎనర్జీ  పెరుగుతుంది. అందుకే... గుడికి వెళ్లినప్పుడు మన మనసుకు  ప్రశాంతంగా ఉంటుంది. 

click me!