హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాగ పంచమి పండుగను శ్రావణ మాసం శుక్లపక్షంలో ఐదో రోజున జరుపుకుంటారు. ఇతర పండుగలతో పాటుగా నాగపంచమిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. మరి ఇంతటి పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాములకు హాని
నాగ పంచమి నాడు మీరు పొరపాటున కూడా పాములకు ఎలాంటి హాని చేయకూడదు. ఈ ఒక్కరోజే కాదు.. ఏ రోజూ కూడా పాములకు హాని కలిగించకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఇనుప పాన్, పాన్ పై ఆహారాన్ని వండడం కూడా నిషిద్ధం. ఈ రోజు ఉడికించిన ఆహారాలను మాత్రమే తినాలని పండితులు చెబుతున్నారు.
పాలు
నాగ పంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించాలని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం ఈ రోజున పాలను తీసుకుని పుట్టలో పోస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పాములకు పాలు విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. అందుకే నాగ పంచమి నాడు నాగదేవతకు పాలను సమర్పించడానికి బదులుగా పాము విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి.
దున్నడం
నాగ పంచమి నాడు భూమిని లేదా పొలాన్ని దువ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే దున్నడం వల్ల పాముల స్థావరాలు దెబ్బతింటాయి. అలాగే నాగ పంచమి నాడు ఆకుకూరలను కోయకూడదు. పురాణాల ప్రకారం.. నాగ పంచమి నాడు సూదులు, కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే జుట్టును కట్ చేయకూడదు.