Vastu Tips: ఇంట్లో గోరింట మొక్క పెంచుకోవచ్చా..లేదా..వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే!

Published : Jul 03, 2025, 02:51 PM IST

వాస్తు ప్రకారం గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించి శాంతిని భంగం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

PREV
17
గోరింటాకు’

ఇంటి పరిసరాల్లో గ్రీన్‌రీ పెరగడం అందరికీ ఇష్టమే.అయితే మొక్కలు నాటేటప్పుడు వాటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం అవసరం. ప్రత్యేకించి వాస్తు శాస్త్రాన్ని పాటించే వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి నేపథ్యంలో ‘గోరింటాకు’ మొక్క ఇంట్లో పెంచడం మంచిదా? అనే సందేహానికి వాస్తు శాస్త్రం ప్రకారం సమాధానం తెలుసుకుందాం.

27
ఇంట్లో పెంచడం

హిందూ సంప్రదాయంలో గోరింటాకు (మెహందీ)కి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కర్వాచౌత్‌, దీపావళి, దసరా, సంక్రాంతి, పెళ్లిళ్లు వంటి శుభ సందర్భాల్లో మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉంది. ఇది శుభానికి, ఆనందానికి ప్రతీకగా చెబుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచడం మాత్రం మంచి విషయం కాదు.

37
ప్రతికూల శక్తులను

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, గోరింటాకు మొక్క కొన్ని ప్రతికూల శక్తులను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే, ప్రత్యేకించి బాల్కనీలో పెంచితే ఆనందం, శాంతి వంటి సానుకూల వాతావరణం దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఇటువంటి మొక్కను ఉంచడం వలన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో విభేదాలు, పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

47
వాస్తు సమతుల్యత

వాస్తు ప్రకారం ఇంటి లోపల, బయట, బాల్కనీలో గోరింటాకు మొక్కను నాటడం వల్ల వాస్తు సమతుల్యత దెబ్బతింటుందనీ, కొన్ని దోషాలు ఏర్పడే అవకాశమూ ఉంటుందనీ చెబుతున్నారు. దీని వలన ఆ ఇంటికి అనవసరమైన ప్రతికూల శక్తులు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వాస్తు శాస్త్రం గోరింటాకు మొక్కతోపాటు మరికొన్ని మొక్కల విషయంలో కూడా ఇలానే సూచిస్తోంది. పత్తి మొక్క, చింతచెట్టు వంటి వాటిని ఇంటి ప్రాంగణంలో పెంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇంటిలో సానుకూల శక్తిని తగ్గించి, ప్రతికూలతలను కలిగించే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.

57
తులసి, మనీ ప్లాంట్

అయితే మొక్కలు పెంచాలనుకుంటే శుభ ఫలితాలను కలిగించే మొక్కలను ఎంచుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తులసి, మనీ ప్లాంట్, అశోక చెట్టు వంటి మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయని చెబుతున్నారు. ఇవి ఇంటికి ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు తీసుకురావడంలో సహాయపడతాయని నమ్మకం. వీటిని తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటితే వాస్తు దోషాలను కూడా తగ్గించుకోవచ్చు.

67
మంచి ఫలితాలు

ఇలా శుభ శక్తిని పెంచే మొక్కలను ఎంచుకోవడం వలన మీ ఇంటి వాతావరణం ఆరోగ్యంగా, శుభంగా మారుతుంది. ఇంట్లో అందరికీ మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. అందుకే, మీరు గోరింటాకు మొక్కను ఇంట్లో పెంచాలనుకుంటే వాస్తు అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

77
చేతికి అందంగా

ఇక మహిళలు గోరింటాకును చేతికి అందంగా పెట్టుకోవడాన్ని కొనసాగించవచ్చు. కానీ అదే మొక్కను ఇంట్లో పెంచితే మాత్రం కొన్ని నెగటివ్ ఫలితాలను కలిగించే అవకాశం ఉంది అనేది వాస్తు నిపుణుల హెచ్చరిక. అందువల్ల గోరింటాకు మొక్కకు బదులుగా తులసి వంటి శుభశక్తిని కలిగించే మొక్కలను పెంచడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories