ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఆదివారం ఈ పరిహారాలు చేయండి

First Published | Dec 17, 2023, 9:38 AM IST

ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజు సూర్యదేవుడిని ఆరాధించే నియమం కూడా ఉంది. ఆదివారం నాడు సూర్యదేవుడిని ప్రత్యేకంగా పూజించిన వారికి ఎన్నో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 

ఆదివారం సూర్యదేవుని పూజకు అంకితం చేయబడింది. ఈ రోజు చాలా మంది సూర్యదేవుడిని నిష్టగా పూజిస్తారు. ఆదివారం సూర్యదేవునికి ప్రత్యేక పూజలు చేస్తే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆదివారం నాడు ఎలాంటి పరిహారాలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి నీటిని సమర్పించండి.

ఆదివారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల సూర్యదేవుడితో పాటుగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.
 


ఆదివారం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎర్రచందనం తిలకాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించాలనే నియమం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 
 

సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆదివారం సూర్యదేవుడికి బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు వస్త్రాన్ని సమర్పించండి.  ఆ తర్వాత వీటన్నింటినీ నిస్సహాయులకు దానం చేయండి. ఈ పరిహారం మీకున్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. 

వీలైతే ఆదివారం నాడు పవిత్ర నదికి వెళ్లి అందులో బెల్లం, బియ్యం కలిపి నదిలో ప్రవహించనివ్వండి. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.
 

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆదివారం నాడు సూర్యభగవానుడితో పాటుగా లక్ష్మీదేవిని ఈ పద్ధతి ప్రకారం పూజించండి. అలాగే ఈ దేవతల మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. 

Latest Videos

click me!