వాస్తు ప్రకారం.. ఇంట్లో ఉసిరి చెట్టును ఏ దిశలో నాటితే మంచిది?

First Published | Dec 16, 2023, 9:40 AM IST

పౌరాణిక హిందూ గ్రంథాల ప్రకారం.. ఉసిరి చెట్టును దేవతల నివాసంగా నమ్ముతారు. అలాగే ఉసిరి చెట్టు, ఉసిరి కాయలను విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిగా పరిగణిస్తారు. అందుకే మీరు వాస్తును దృష్టిలో ఉంచుకుని మీ ఇంట్లో ఉసిరి చెట్టును నాటితే.. ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 

amla tree

హిందూమతంలో.. ఎన్నో చెట్లును, మొక్కలను పవిత్రంగా భావిస్తారు. పూజలు చేస్తారు. ఇలాంటి వాటిలో ఉసిరి చెట్టు ఒకటి. ఉసిరిచెట్టు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందుకే ఉసిరి చెట్టును ఇంట్లో ఏ దిశలో నాటడం ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

amla tree

ఉసిరి చెట్టు మతపరమైన ప్రాముఖ్యత

ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందకే ఈ చెట్టును, దీని కాయను విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజును ఉసిరి నవమి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజిస్తారు.
 

అంతేకాదు ఈ రోజు మీరు ఉసిరి చెట్టు నీడలో కూర్చుని అన్నం తింటే మీకున్న ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే వ్యక్తులు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్ముతారు. 
 


amla tree

ఏ దిశలో చెట్టు నాటాలి? 

వాస్తు ప్రకారం.. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటాలి. ఈ దిశలో ఉన్న ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇది ఇంటికి మంచిది కూడా. హిందూ విశ్వాసాల ప్రకారం.. ఉసిరి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో దేవతలు, దేవుళ్లు ఉంటారు.
 

amla tree

ఈ ప్రయోజనాలను పొందుతారు

వాస్తు శాస్త్రంలో.. ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఉసిరి చెట్టును నాటడం, క్రమం తప్పకుండా ఆ చెట్టుకు నీరు పోయడం వల్ల మీ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటాయి. అలాగే ఇంట్లోని నెగిటీవ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దీని వల్ల మీ కుటుంబంలో సంపద మార్గం వస్తుంది.

Latest Videos

click me!