అయ్యప్పస్వామి గుడికి శబరిమల అనే పేరు ఎలా వచ్చింది?

First Published | Dec 16, 2023, 4:02 PM IST

ప్రతి ఏడాది శబరిమలకు అయ్యప్పస్వాములు భారీ సంఖ్యలో వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయానికి.. శబరిమల అనే పేరు పెట్టడం వెనుకు ఎంతో కథ ఉందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 
 

sabarimala

శబరిమల ఆలయం ఎంతో పవిత్రమైన, ప్రత్యేకమైన, ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం కేరళలోని పట్టనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. అయితే ఈ ఆలయం ఎన్నో నియమ, నిబంధనలు పాటిస్తూ వస్తోంది. ఒకప్పుడు శబరిమల ఆలయంలోకి రుతుస్రావం అయ్యే మహిళల ప్రవేశాన్ని నిషేదించారు. అయితే దీన్నిరాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

sabarimala ayyappan

అయితే ఈ కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని 2016, నవంబర్ 21 నుండి అధికారికంగా శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయమని పిలుస్తున్నారు. అంతకు ముందు ఈ ఆయాన్ని శబరిమల శ్రీ ధర్మ శాస్త్ర ఆలయమని అనేవారు. అయితే ఈ ఆలయం మొదటి పేరు శబరిమలతో ప్రసిద్ధి చెందింది.


శబరిమల అనే పదానికి రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉంది. అంటే శ్రీరామ భక్తురాలైన శబరి కొండలు అని అర్థం. పురాణ గాథ ప్రకారం.. రావణుడిచే అపహరించబడిన సీతను వెతికి రక్షించేందుకు రాముడు లంకకు వెళుతున్నప్పుడు ఈ అడవిలో శబరిని చూస్తాడు. శబరి రామభక్తురాలు. రాముడి కోసం ఎన్నో పండ్లను సేకరిస్తుంది. ఆ పండ్లు తీయగా ఉన్నాయో రుచి చూసిన పండును రాముడికి ఇస్తుంది. ఎంగిలి అనుకోకుండా శ్రీరాముడు కూడా శబరి రుచి చూసిన పండును అలాగే తింటాడు. అంతేకాదు శబరి శ్రీరాముడికి ఎంతో సేవ చేస్తుంది. ఆమె భక్తికి, అంకిత భావానికి శ్రీరాముడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆమె నివసించే కొండకు శబరిమల అని పేరు పెట్టాడు. దీంతో ఆమె పేరు స్థిరస్థాయిలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రాముడు ఈ పేరు పెట్టాడని పురాణాల్లో ఉంది. 

శబరి కారణంగానే  ఈ ఆలయానికి శబరిమల ఆలయం అనే పేరు వచ్చింది. ఎందుకంటే దీని నిర్మాణానికి అంతిమ కారణం శబరి అని భావించబడింది కాబట్టి. పురాణాల ప్రకారం.. ఈ సంఘటన సుమారు 4,000 సంవత్సరాల కిందట జరిగింది.
 

శబరిమల ఆలయ పునర్నిర్మాణం 1950 లో జరిగింది. ఒక పంచకోళతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని స్థాపించారు. ఒక పంచకోళ అంటే ఐదు లోహాలతో కూడిన విగ్రహం అని అర్థం. శబరిమల ఆలయంలోని అయ్యప్ప విగ్రహానికి ఉపయోగించే ఐదు లోహాలు బంగారం, వెండి, ఇనుము, రాగి, సీసం.
 

శబరిమల ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. నవంబర్-డిసెంబర్ 41 రోజుల మండల పూజ ఉంటుంది. ఇది తీర్థయాత్రల సీజన్. డిసెంబర్ 27న ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇది మకర విళక్కు పండుగ కోసం డిసెంబర్ 30 , జనవరి మధ్య తిరిగి తెరుచుకుంటుంది. మళయాళ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి నెలలో మొదటి ఐదు రోజులు ఈ ఆలయం తెరవబడుతుంది.

Latest Videos

click me!