Sri Krishna Janmashtami 2022: ఈ కోట్స్‌తో స్నేహితులకు, కుటుంబసభ్యులకు కృష్ణాష్టమి విషెస్ చెప్పండిలా!

First Published | Aug 17, 2022, 10:12 PM IST

Sri Krishna Janmashtami 2022: నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి.. బ్రహ్మాండాన్ని ఉద్దారించేందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఎనిమిదో అవతారంలో జన్మించాడు. 

దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి కారాగారంలో జన్మించారు. ఈరోజునే శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినంగా జరుపుతున్నాం. ఈ సందర్బంగా మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, బంధువులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోట్స్  మీకోసం..

శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, ఈ కృష్ణాష్టమి మీ జీవితాలలో ఆనందం చేకూర్చాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

"కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి "
మిత్రులందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!


చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మెలతాడు పట్టు దట్టి సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతుము...
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికంకరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరి చందనంచ కలయం కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి....
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!

"నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా"
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభకాంక్షలు!

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!
"కృష్ణా.... నీటిలో నీవే...
నింగిలో నీవే.. నేలపై నీవే ...
నలువైపులా నీవే...
నా ఎద నిండా నీవే"

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!!!
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్!
 

యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

"ప్రేమను కాస్త అందిస్తే ప్రాణమే ఇస్తాడు... భక్తి తో నువ్వు పూజిస్తే...... తాను భగవంతుడనని మరచి పోతాడు... నల్లని రూపమున్నోడు... మల్లెవంటి తెల్లని మనసున్నోడు... మధురంగా పిలిస్తే పరవశించి.. మనస్సంతా నిండిపోతాడు"
మిత్రులందరికీ.... శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
మిత్రుందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

 దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా.. మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

Latest Videos

click me!