హిందూ వివాహాల్లో తమలపాకు ఎందుకు వాడతారు..?

First Published | Feb 23, 2022, 4:29 PM IST

భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు.దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

మీరు గమనించారో లేదో గానీ.. తమళపాకులు లేకుండా.. మన హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం పూర్తవ్వదు.  ముఖ్యంగా పెళ్లిలో.. తమలపాకు కీలక పాత్ర పోషిస్తుంది. పెళ్లి కూతురు మండపంలో అడుగుపెట్టడానికి చేతిలో తమలపాకుతో ఉన్న తాంబూళం ఉండాలి. ఆఖరికి జిలకర బెల్లాన్ని కూడా తమలపాకుతో కలిపే పెడతారు. అసలు తమలపాకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు..? దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందో ఓసారి  చూద్దామా..

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1.పూలు 2.అక్షింతలు, 3.ఫలాలు,4,అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు.కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు.పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు.పసుపు గణపతినీ,గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.భారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు.

Latest Videos


భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు.దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

క్షీర సాగర మథనం గురించి కూడా వినే ఉంటారు. స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి.కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని  నమ్ముతుంటారు. 

తమలపాకు మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ ఉంటారట.  అందుకే.. తమలపాకుకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
 

ఏదైనా బంధాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ తమలపాకును ఉపయోగిస్తే.. వారికి మంచి జరుగుతుందని నమ్మకమట. అందుకే కచ్చితంగా పెళ్లిలో వీటిని ఉపయోగిస్తారు.

హిందూ పెళ్లిలో జిలకర బెల్లం పెడితే.. దాదాపు పెళ్లి అయిపోయినట్లే. అలాంటి జిలకర బెల్లాన్ని.. తమిళపాకులో ఉంచే పెడతారు.

ఇక బెంగాళీ పెళ్లిలో అయితే.. వధువుని ఆమె సోదరులు తీసుకువస్తుండగా... ఆమె.. తన ముఖాన్ని రెండు తమలపాకులతో కనిపించకుండా కవర్ చేస్తుంది. తర్వాత.. వరుడు ముందు కూర్చొని వాటిని తొలగించి పెళ్లి కొడుకును చూస్తుందట. అలా చేస్తే అదృష్టం కలుగుతుందని వారి నమ్మకం.

రాజస్థానీ పెళ్లిలో.. వధువు కుటుంబం.. వరుడు కుటుంబానికి భోజనం వడ్డించాలట. అందులో తమళపాకు కచ్చితంగా ఉండాలట. అది వారి  సంప్రదాయమట.

click me!