దసరా రోజున ఎవరికైనా చీపురు దానం చేస్తే..చాలా మంచి జరుగుతుందట. చీపురే ఎందుకు అనే సందేహం మీకు రావచ్చు. దాని వెనక కూడా ఒక కారణం ఉందట. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. చీపురు ఇంట్లో ఉంది అంటే.. సంపదను ఆకర్షిస్తుందని అర్థమట. మరోవైపు దసరా రోజున లక్ష్మీదేవి తన పది గొప్ప శాస్త్రాలతో పాటు బంగారు కలశంతో భూమిపై తిరుగుతుందని నమ్ముతారు.
అందుకే.. దసరా రోజున చీపురు దానం చేయడం వల్ల.. సంపద పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు.. ఊహించని ధనలాభం కూడా పొందే అవకాశం ఉంటుందట. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా పూర్తిగా పోయి.. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.