Sharad Purnima upay
సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శరద్ పూర్ణిమ నాడు గంగా స్నానం కూడా చేసేవారున్నారు. అంతేకాదు దానాలు, పూజలు కూడా చేస్తారు. వీటివల్ల జీవితంలోని బాధలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో విజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అనుకున్న నెరవేరేందుకు ఈ పూర్ణిమ నాడు మహావిష్ణువుకు ఉపవాసం ఉంటారు. అంతేకాదు ఈ రోజున శ్రీ సత్యనారాయణ పూజను కూడా చేస్తుంటారు. మొత్తంగా పూర్ణిమ తిథి ఎంతో శుభప్రదమైంది. ఈ రోజు మహావిష్ణువును పూజిస్తే భక్తులు అపారమైన ఫలితాలను పొందుతారని నమ్ముతారు. అలాగే జీవితంలోని బాధలు, దుఃఖాలు, కష్టాలన్నీ దూరమవుతాయని విశ్వసిస్తారు. మరి ఈ శరద్ పూర్ణిమ తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
sharad purnima 2023 upay 03
శరద్ పూర్ణిమ ఎప్పుడు?
ప్రతి ఏడాది శరద్ పూర్ణిమను అశ్విని మాసంలోని శుక్లపక్షం నాల్గొ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న వచ్చింది. కాగా ఈ శరద్ పూర్ణిమ నాడే ఈ ఏడాది చివరి, రెండో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కూడా కనినించనుంది. అందుకే మన దేశంలో కూడా సూతక్ కాలం చెల్లుబాటు అవుతుంది.
శుభ సమయం
పంచాంగం ప్రకారం.. పూర్ణిమ తిథి అక్టోబర్ 28న ఉదయం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే అక్టోబర్ 29 ఉదయం 01:53 గంటలకు ముగుస్తుంది.
పూజా విధానం
శరద్ పూర్ణిమ నాడు ఉదయాన్నే నిద్రలేవాలి. వెంటనే లోక సృష్టికర్తలైన విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నమస్కరించాలి. తర్వాత ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. రోజువారీ పనులన్నింటినీ కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగా నీరు కలిగిన నీటితో స్నానం చేయాలి. మీకు అందుబాటులో ఉంటే పవిత్ర నదిలో స్నానం చేస్తే ఇంకా మంచిది. తర్వాత ద్యానం చేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. కొత్త బట్టలు ధరించి సూర్యభగవానునికి నీటిని సమర్పించండి. పౌర్ణమి రోజున తిలాంజలి కూడా చేస్తారు. ఆ తర్వాత మహావిష్ణువును పూజించండి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు పసుపు రంగు పండ్లు, పూలు, దుస్తులు సమర్పించాలని పూజారులు చెప్తున్నారు. అయితే పూజ సమయంలో విష్ణు చాలీసా తప్పకుండా పఠించండి. పూజ చివర్లో హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి దాన ధర్మాలు చేస్తే పుణం దక్కుతుంది. దేవుడి అనుగ్రహం కూడా పొందుతారు.