నవంబర్ నుంచే శుభకార్యాలు ప్రారంభం..శుభదినాలు, పెళ్లి ముహూర్తాలు ఏయే తేదీనా వస్తున్నాయంటే?

First Published | Oct 26, 2023, 4:32 PM IST

నవంబర్ నుంచి శుభదినాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాదు ఈ నెలలోనే శుభకార్యాలు కూడా స్టార్ట్ అవుతాయి. హిందూ మతంలో ఏదైనా శుభకార్యం చేసే ముందు శుభ ముహూర్తాన్నిఖచ్చితంగా చూస్తారు. అంతేకాదు నవంబర్ లో కొన్ని రోజులు ఆధ్యాత్మిక పనులకు చాలా పవిత్రమైనవి.
 


హిందూ మతంలో.. ఎలాంటి పని ప్రారంభానికైనా ఖచ్చితంగా శుభ ముహూర్తాన్ని చూస్తారు. ముహూర్తం చేసే శుభకార్యాలను చేస్తారు. ధార్మిక విశ్వాసాల ప్రకారం.. శుభ సమయంలో దేవతలను పూజించడం వల్ల భక్తులు దేవతల ఆశీస్సులు పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనులు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. జ్యోతిష్యం ప్రకారం.. ఈ మాసం ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ మాసంలో ఎన్నో పెద్ద పెద్ద, ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి. అలాగే పెళ్లి వంటి శుభకార్యాలు కూడా కూడా ఈ మాసం నుంచే ప్రారంభవుతాయి. అందుకే నవంబర్ లో వచ్చే శుభ ముహూర్తాల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం.
 

సర్వార్థ సిద్ధి యోగం

జ్యోతిషశాస్త్రంలో సర్వార్థ సిద్ధి యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. నవంబర్ లో ఈ సర్వార్థ సిద్ధి యోగం 01, 03, 05, 11, 18, 23, 24, 27, 29, 30 తేదీల్లో ఏర్పడుతుంది.
 


అమృత సిద్ధి యోగం

మత విశ్వాసాల ప్రకారం.. అమృత సిద్ధి యోగాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో దేవతలను పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే జీవితం ఆనందంగా సాగుతుంది. నవంబర్ 24న ఈ పవిత్ర యోగం ఏర్పడుతుంది. 

నామకరణ ముహూర్తం

ఈ ఏడాది నవంబర్ 08, 09, 10, 19, 22, 23, 24, 27, 29 తేదీలలో నామకరణ కార్యక్రమం జరగనుంది. 

అన్నప్రాసన

నవంబర్ నెలలో పిల్లలకు అన్నప్రాసన చేయడనికి మంచి రోజులు ఉన్నాయి. నవంబర్ 10, 22, 24, 27, 29 తేదీలు అన్నప్రాసనకు శుభప్రదం. అలాగే నవంబర్ 03, 04, 05, 11, 19, 20, 24, 25, 29 తేదీలు కర్ణవేద(పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమం) కు అనుకూలంగా ఉంటాయి.

వాహనం, ఆస్తి కొనుగోలు ముహూర్తం

నవంబర్ లో వాహన కొనుగోలకు 03, 10, 20, 27 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 03, 07, 08, 13, 14, 17, 22 నవంబర్ తేదీల్లో ఆస్తి లేదా ఇంటి కొనుగోలుకు అనుకూలంగా ఉంటాయి.

వివాహం, గృహ ప్రవేశం, విద్యారంభానికి ముహూర్తం

పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కూడా నవంబర్ మాసం నుంచే మొదలవుతాయి. నవంబర్ నెలలో పెళ్లికి శుభ ముహూర్తం.. 23, 27, 28, 29 న పవిత్రంగా ఉంటుంది. అలాగే నవంబర్ 22, 23, 27, 29 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్నాయి. నవంబర్ 02, 10, 15, 24, 29 తేదీలు విద్యారాంబానికి మంచిరోజులు. 
 

Latest Videos

click me!