ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం.. భారత్ లో కనపడుతుందా..?
అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం మన కళ్లముందుకు రావడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ నెల 29వ తేదీన ఈ రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబర్ 14న సంభవించిన సూర్యగ్రహణం తర్వాత 14 రోజుల తర్వాత ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది.
చంద్రగ్రహణం అంటే ఏమిటి?
నాసా ప్రకారం, చంద్రగ్రహణం పౌర్ణమి దశలో సంభవిస్తుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్ర గ్రహణం అంటారు. కొన్నిసార్లు చంద్రుని ఉపరితలం కొన్ని గంటల వ్యవధిలో ఎరుపు రంగులోకి మారుతుంది. ప్రతి చంద్ర గ్రహణం భూమి సగం నుండి కనిపిస్తుంది.
పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏమిటి?
పౌర్ణమి, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది.
పాక్షిక చంద్రగ్రహణం తేదీ:
సైన్స్ మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, 28-29 అక్టోబర్, 2023 (6-7 కార్తీక, 1945 శక శకం) పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. అక్టోబరు 28 అర్ధరాత్రి చంద్రుడు పెనుంబ్రాలోకి ప్రవేశించినప్పటికీ, అంబ్రల్ దశ అక్టోబర్ 29 ప్రారంభ గంటలో ప్రారంభమవుతుంది.
భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందా?
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా, ఈశాన్య ఉత్తర అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణం కనిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అక్టోబర్ 28వ తేది ఉదయం 3 గంటల 17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. అయితే పౌర్ణమి పూజలు చేయాలనుకునేవారు తప్పకుండా ఉదయం 4:10 నిమిషాల వరకు మతపరమైన కార్యక్రమాలు చేయవచ్చు.
ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అశ్విని శుక్ల పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీన సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణం ప్రభావం తప్పకుండా భారతదేశంపై కూడా పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భారతదేశంతో పాటు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది.
భారతదేశంలో తదుపరి చంద్రగ్రహణం తేదీ ఎప్పుడు ?
తదుపరి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది, ఇది 7 సెప్టెంబర్ 2025న భారతదేశం నుండి కనిపిస్తుంది. భారతదేశం 2022 నవంబర్ 8న చివరి చంద్రగ్రహణాన్ని చూశారు, ఇది సంపూర్ణ గ్రహణం కావడం విశేషం.