ఈ రోజే శరద్ పూర్ణిమ.. ఈ తప్పులను అస్సలు చేయకండి.. పొరపాటున కూడా చేశారో..!

First Published | Oct 28, 2023, 9:50 AM IST

sharad purnima 2023: శరద్ పూర్ణిమను అశ్విని పూర్ణిమ అని కూడా అంటారు. హిందూ మతంలో ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ రోజుకు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. లేదంటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

శరద్ పూర్ణిమకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజు భక్తులు శ్రీమహావిష్ణువును, చంద్రుడిని పూజిస్తారు. అలాగే నిష్టగా ఉపవాసం ఉంటారు. సుఖ శాంతుల కోసం దేవుడిని ప్రార్థిస్తారు. అయితే శరద్ పూర్ణిమ పూజ ఫలితాలను పొందాలంటే ఈ రోజు చేయాల్సిన, చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

శరద్ పూర్ణిమ నాడు ఏం చేయకూడదు? 

పవిత్రమైన శరద్ పూర్ణిమ నాడు మాంసం, వెల్లుల్లి, ఉల్లి, చేపలు వంటి ఆహారాలను అస్సలు తినకూడదు. 
ఈ రోజు ఆల్కహాల్ ను అసలే తాగకూడదు. 
అలాగే ఈ ప్రత్యేకమైన రోజున గోర్లు, జుట్టును కట్ చేయకూడదు. 
అశ్విన్ పూర్ణిమ రోజు మీకు ఇష్టమైన వ్యక్తి లేదా జీవిత భాగస్వామితో వాదించకూడదు. 


ఈ రోజు చంద్రగ్రహణం కూడా.. అందుకే ఈ రోజు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. 
జూదం మొదలైన వాటికి దూరంగా ఉండాలి
పెద్దలను అవమానించడం మంచిది కాదు. 
 

lord vishnu 001

శరద్ పూర్ణిమ నాడు ఏం చేయాలి?

ఈ రోజున నిష్టగా, భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండాలి.
విష్ణుమూర్తిని పూజించాలి. 
అంతేకాదు ఈ రోజు శ్రీకృష్ణుడు, రాధా మాతను కూడా పూజించాలి. 
చంద్రగ్రహణం ఈ రోజే కాబట్టి ఈ రోజు శివుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

ఈ సమయంలో శివ మంత్రాన్ని పఠిస్తే ప్రయోజకరంగా ఉంటుంది. 
భోగాన్ని దేవుడికి సమర్పించడం కూడా పుణ్యప్రదంగా భావిస్తారు.
గ్రహణం ప్రారంభానికి ముందు ఖీర్ తయారు చేసి చంద్రుడికి సమర్పించాలి. 
ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి.
ఈ రోజు గంగానదిలో పవిత్ర స్నానం చేయడం కూడా పవిత్రంగా భావిస్తారు.

Latest Videos

click me!