karthika masam 2023: కార్తీక మాసం పవిత్ర నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.. ఈ నియమాలు తెలుసా?

First Published | Oct 27, 2023, 4:35 PM IST

karthika masam 2023: కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో నదిలో స్నానం చేయడం, తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఎంతో మంది పవిత్రమైన నదిలో స్నానమాచరిస్తారు. దీన్నే కార్తిక సానం అంటారు. అయితే కార్తీక స్నానికి కొన్ని నియమాలు ఉన్నాయి. 
 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక మాసం అశ్విని మాసం తర్వాత వస్తుంది. ఈ మాసాన్ని శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు కూడా. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాదు ఈ మాసాన్ని తపస్సు, ఉపవాస మాసం అని కూడా అంటుంటారు. శరద్ పూర్ణిమ ముగిసిన తర్వాత ఈ కార్తీక మాసం మొదలవుతుంది. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 29 న ప్రారంభమై నవంబర్ 27 న  ముగుస్తుంది.
 

కార్తీక మాసంలో స్నానం ప్రాముఖ్యత 

ధార్మిక విశ్వాసాల ప్రకారం.. కార్తీక మాసంలో మహావిష్ణువు మత్స్య రూపంలో నీటిలో కొలువై ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు మోక్షాన్ని పొందుతారని, వారి పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. 
 


కార్తిక స్నాన నియమాలు

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.లేదా పవిత్రనదిలో స్నానమాచరించాలి. అప్పుడే కార్తిక స్నానం ఫలితాలను పొందుతారు. 

కార్తిక స్నానం ఆచరించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల మీకు అదృష్టం పెరుగుతుంది.

అయితే కార్తీక స్నానం చేసేవారు తమ శరీరానికి నూనె రాయకూడదు. 


కార్తీక స్నానం చేసిన తర్వాత తులసిలో నీళ్లు పోసి పరిక్రమం చేయాలి. సాయంత్రం పూట తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.

కార్తీకమాసంలో స్నానమాచరించి ఉపవాసం ఉండేవారు ఉల్లి, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. 

కార్తీక పౌర్ణమిని అనుసరించే వారు మాంసాహారం తినకూడదు. అలాగే తప్పుడు ఆహారాలను కూడా తినకూడదు. 
 

Latest Videos

click me!