తర్వాత పంచ ద్రవ్య అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తీసుకొని గణపతిని ధ్యానిస్తూ లేదా గణపతి మూల మత్రం చదువుతూ అభిషేకం చేయాలి. లేదా సమీపంలోని ఆలయానికి ఈ అభిషేక ద్రవ్యాన్ని తీసుకెళ్లి అభిషేకం చేయించుకోవాలి.
తర్వాత శుభ్రంగా కడిగిన తర్వార వినాయకుడికి ఇష్టమైన దర్భ గడ్డి, తెల్ల జిల్లేడు, మందార పుష్పం, దూర్వాలతో పూజించాలి. ఆ సమయంలో గణపతి అష్టోత్తరం చదువుకుంటే మంచిది.
దర్భతో వినాయకుని స్థాపన: భక్తితో వినాయకుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని స్థాపించి పూజ చేయాలి.
తర్వాత మోదకాలు గాని, కుడుములు, ఉండ్రాళ్లు లాంటి గణపతి ఇష్టమైన ఆహారాన్ని వండి నైవేద్యంగా పెట్టాలి.