మీకు రోడ్డుపై డబ్బు దొరికిందా? అయితే మీకు జరిగేది ఇదే!
మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడన్ గా కాయిన్ గాని, నోటు గాని కనిపిస్తే ఏం చేస్తారు. చాలామంది తీసి జేబులో వేసుకుంటారు. ఇలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడన్ గా కాయిన్ గాని, నోటు గాని కనిపిస్తే ఏం చేస్తారు. చాలామంది తీసి జేబులో వేసుకుంటారు. ఇలా చేస్తే మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ చిల్లర కాయిన్స్ కనిపిస్తుంటాయి. కొందరైతే ఏకంగా నోట్లు కూడా పడేసుకుంటారు. అలా దొరికిన డబ్బును కొందరు వెంటనే తీసుకుని జేబులో వేసుకుంటారు. కొందరైతే తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ముందుకెళ్లి తీసుకుందామని వెనక్కి తిరుగుతారు. ఈలోగా వెనకాల వస్తున్న వ్యక్తి ఆ డబ్బు తీసేసుకుంటారు. ఇలా మనలో చాలామందికి జరిగే ఉంటుంది. అయితే అసలు డబ్బు దొరకడం అదృష్టమా? లేక భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతమా? ఈ విషయంపై జ్యోతిష్య పండితులు చెప్పిన వివరణ ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రోడ్డుపై డబ్బు కనిపిస్తే అది అదృష్టానికి సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు ఇలా డబ్బు కనిపిస్తుందని చెప్తున్నారు. దేవుడి దయ ఉంటేనే రోడ్డుపై కాయిన్ లేదా నోట్ దొరుకుతుందని అంటున్నారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు పర్స్ కనిపిస్తే వారికి ఆస్తి కలిసి వస్తుందని ముందస్తు సంకేతం. అంటే పూర్వీకుల ఆస్తి గాని, తల్లిదండ్రులు, అత్తమామల ఆస్తి గాని త్వరలో డబ్బు దొరికిన వ్యక్తికి లభిస్తుందని అర్థం. అంతేకాకుండా వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మికంగా లాభాలు పొందుతారు. ఇలాంటప్పుడు ఎక్కడైనా పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుతారు.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాయిన్ లేదా నోటు కనిపిస్తే అది అదృష్టానికి చిహ్నమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ వ్యక్తి త్వరలో తాను అనుకున్న రంగంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడని అర్థమట. అలా దొరికిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడం లేదా ఇంట్లో పూజ గదిలో పెట్టి నిత్యం పూజ చేయడం మంచిది అని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
రోడ్డుపై డబ్బు దొరకడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే ముందు, వ్యాపారం లో లాభాలు వచ్చే ముందు ఇలా అదృష్టవంతులకు రోడ్డుపై డబ్బు దొరుకుతుంది. అందువల్ల మీకు ఎప్పుడైనా రోడ్డుపై డబ్బు దొరికితే మీకు త్వరలో అదృష్టం కలిసి రాబోతుందని అర్థం.
ఇది కూడా చదవండి పిల్లలకు టీ ఇవ్వొచ్చా? తల్లిదండ్రులు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి