ఆనందంగా, సుఖ, సంతోషాలతో బతకాలని చాలా మంది అనుకుంటారు. అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రావొద్దని అనకుంటారు. ఇందుకోసం ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే ప్రతి రోజూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే ఎంతో కష్టపడుతుంటారు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ ఇల్లు సుఖ, సంతోషంతో నిండి ఉండాలన్నా.. మీరు ఆర్థికంగా బాగుండాలన్నా.. శుక్రవారం రాత్రి కొన్ని కొన్ని పరిహారాలు చేయాలట. అవును ఇలా చేస్తే మీరు కొన్ని రోజుల్లోనే ధనవంతులు అయిపోతారట.
ఈ చర్యల వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉన్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీరు చేస్తున్న పనుల్లో లాభాలను అర్జిస్తారు. ఇందుకోసం శుక్రవారం రోజు రాత్రి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు చాలా మందే ఉన్నారు. సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అష్టలక్ష్మి ఆరాధన చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు.
అవును జ్యోతిష్యుల ప్రకారం.. అష్టలక్ష్మీ ఆరాధన మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు 108 సార్లు జపించాలి. ఈ మంత్రం మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుంది. చేస్తున్న పనిలో లాభాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
అంతేకాదు ఈ లక్ష్మీదేవీ మంత్రం.. మీకు ఆమె అనుగ్రహం పొందేలా చేస్తుంది. ఇందుకోసం మీరు శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు ఐం హీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్దయే అనే మంత్రాన్ని జపించండి. ఎర్రని వస్త్రంపై పరిచి దానిపై లక్ష్మీ దేవి యంత్ర చిత్రపటాన్ని పెట్టి నిష్టగా పూజ చేయండి.
ఈ మంత్రాన్ని జపించడం వల్ల వ్యాపారం సాఫీగా సాగుతుంది. అలాగే మంచి లాభాలను పొందుతారు. అయితే పూజా సమయంలో ఈ యంత్రానికి అష్టగంధాన్ని పెట్టాలి. అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి తిలకం పెట్టడం మర్చిపోకూడదు.
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇళ్లు సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ రోజు మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలనేవే రావటని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు.