lunar eclipse 2023: చంద్రగ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదో ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

Published : Oct 26, 2023, 10:20 AM IST

lunar eclipse 2023: శరద్ పూర్ణిమ నాడు గంగానదిలో స్నానం చేసి మహావిష్ణువును పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఈ ఏడాది చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ నాడే ఏర్పడనుంది. ఈ గ్రహణం మనదేశంలో కూడా కనిపిస్తుంది. అందుకే ఇండియాలో కూడా సూతక్ చెల్లుబాటు అవుతుంది. ఈ సమయంలో కొన్ని పనులను చేయకూడదంటారు జ్యోతిష్యులు.   

PREV
14
 lunar eclipse 2023: చంద్రగ్రహణం సమయంలో ఈ తప్పులు చేయకండి.. లేదో ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్లపక్ష చతుర్దశి మరుసటి రోజున శరద్ పూర్ణిమను జరుపుకుంటారు. అంటే ఈ ఏడాది అక్టోబర్ 28నాడు శరద్ పౌర్ణమను జరుపుకోబోతున్నారు. సనాతన ధర్మంలో శరద్ పూర్ణిమ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పూజ చేయడం, గంగానదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి ఆచారాలు  కూడా ఉన్నాయి. అయితే శరద్ పూర్ణిమ నాడు గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణును పూజిస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజు పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని కూడా విశ్వసిస్తారు. అయితే ఈ ఏడాది చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ నాడే ఏర్పడనుంది.  అయితే ఈ చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుంది. అందుకే సూతక్ చెల్లుబాటు అవుతుంది. సుతక్ కాలంలో ధార్మిక పనులు, శుభకార్యాలు చేయడం నిషిద్ధం.  కాదని అలాగే శుభకార్యాలు చేస్తే ప్రతికూల ప్రభావాలను పొందుతారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

24

ఏం చేయాలి?

గర్భిణులు చంద్రగ్రహణం సమయంలో శ్రీఫలాన్ని తమతో పాటే ఉంచుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం అయిపోయే వరకు దాన్నీ మీతో పాటే ఉంచుకోవాలి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఉదయాన్నే శ్రీఫలాన్ని కడగండి.

గ్రహణ సమయంలో గర్భిణులు తమ పొట్టపై ocher ను పెట్టుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కడుపులో ఉన్న శిశువుపై గ్రహణం ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. 

34
lunar eclipse

చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరు బయటకు అసలే వెళ్లకూడదు. పదునైన వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు. గ్రహణం తర్వాత తలస్నానం చేయాలి.

గ్రహణం సమయంలో.. లోకానికాధిపతి అయిన శ్రీమహావిష్ణువు లేదా దేవతల దేవుడైన పరమేశ్వరుడి మంత్రాలను పఠించండి. మీరు శివుడు లేదా విష్ణు మంత్రాన్ని పఠించొచ్చు. అలాగే గాయత్రి, మహామృత్యుంజయ మంత్రాలను పఠించినా కూడా మంచే జరుగుతుంది. 
 

44


ఏమి చేయకూడదు?

చంద్రగ్రహణం సమయంలో మర్చిపోయి కూడా దేవుళ్ల విగ్రహాలను తాకకూడదు.
చంద్రగ్రహణం సమయంలో పదునైన వస్తువులను అంటే చాకులు, బ్లేడు, కత్తెరలు వంటి వాటిని ఉపయోగించకూడదు. 
గర్భిణీ స్త్రీలు కత్తెర, కత్తులు, సూదులు మొదలైన వాటిని ఉపయోగించడం మంచిది కాదు. 
గ్రహణం సమయంలో ఎవరిపైనా ద్వేషం పెంచుకోకండి. ఎవ్వరి మనస్సును గాయపర్చకండి. 
చంద్రగ్రహణం సమయంలో శ్మశానాలు, ప్రతికూల ప్రదేశాలకు వెళ్లకూడదు.

click me!

Recommended Stories