Navratri: దేవి నవరాత్రి సందర్భంగా దర్శించుకోవాల్సిన తొమ్మిది పుణ్యక్షేత్రాలు ఇవే!

First Published | Oct 2, 2021, 3:57 PM IST

Navratri: హిందూ ప్రజలు జరుపుకునే పండగ దేవీ నవరాత్రులు. నవరాత్రుల అనంతరం దసరా పండగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారు వెలిసిన తొమ్మిది అవతారాలు గురించి.. ఆ అవతారాలలో అమ్మవారికి చేసే పూజలు గురించి అందరికీ తెలుసు. 

Navratri: హిందూ ప్రజలు జరుపుకునే పండగ దేవీ నవరాత్రులు. నవరాత్రుల అనంతరం దసరా పండగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారు వెలిసిన తొమ్మిది అవతారాలు గురించి.. ఆ అవతారాలలో అమ్మవారికి చేసే పూజలు గురించి అందరికీ తెలుసు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే పాపాలు తొలగిపోతాయి. 9 దుర్గమ్మలుగా పూజించబడే ఈ అమ్మవార్ల ఆలయాలు పలు ప్రాంతాలలో కొలువై ఉన్నాయి. ఇంతకీ ఆ తొమ్మిది అవతారాల అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

శైలపుత్రి: నవరాత్రి పూజలో మొదటి అవతారంలో శైలపుత్రిగా పూజిస్తారు. ఈ అమ్మవారు కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం పట్టుకొని వృషభ వాహనరూఢుపై కూర్చొని దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి దేవాలయం వారణాసిలో మర్హియ ఘాట్ వద్ద ఉంది. మరొక ఆలయం హేదవతి అనే గ్రామంలో ఉంది.

Latest Videos


బ్రహ్మచారిణి: రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిని అవతారంలో పూజిస్తారు. ఈమె శ్వేత వర్ణ దుస్తులను ధరించి దర్శనమిస్తుంది. ఇక ఈ అమ్మవారి ఆలయం వారణాసి లో ఉంది. వారణాసిలో 9 దుర్గమ్మ లకు వేరు వేరు ఆలయాలు ఉన్నాయి.
 

చంద్రఘంట: మూడవరోజు చంద్రఘంట అవతారంలో పూజిస్తారు. అమ్మవారి తలపై చంద్రుడు ఘంటా కారంలో ఉండటం వల్ల అమ్మవారికి ఈ పేరు వచ్చింది. సింహ వాహనము కలిగిన ఈమె పది చేతులతో దర్శనమిస్తుంది. ఇక ఈ అమ్మవారి ఆలయం వారణాసిలో ఉంది.

కూష్మాండ దుర్గా: నాలుగవ రోజు కుష్మాండ దుర్గా అవతారములో ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈమెకు అష్టభుజి అనే మరో పేరు కూడా ఉంది. ఈమెకు ఎనిమిది భుజాలు ఉండటంవల్ల అలా పిలుస్తారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసిలో మరియు కాన్పూర్ లో కూడా ఉంది.

స్కంద మాత: ఐదవ రోజున స్కందమాత అనే అమ్మవారి అవతారం లో దర్శనమిస్తుంది. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. ఈమెను చతుర్భుజి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసి లో  అన్నపూర్ణ దేవాలయం పక్కన కొలువై ఉంటుంది.

కాత్యాయని: ఈ అమ్మవారిని ఆరవరోజు కాత్యాయని అవతారం లో పూజిస్తారు. ఈమె బంగారు వర్ణముతో నిండి ఉంటుంది. ఈమె విజయదశమిరోజు మహిషాసురుడిని వధించిందని పురాణాలు చెబుతాయి. ఈ అమ్మ వారి ఆలయం వారణాసి మరియు కొల్హాపూర్ లో కూడా ఉంది.

కాళరాత్రి: ఏడవ రోజు అమ్మవారి దర్శనం కాళరాత్రిగా కనిపిస్తుంది. ఈమె శిరస్సుపై కేశములు ఉండటంతోపాటు భయంకరమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈమెను శుభంకరి అని మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి ఆలయం వారణాసిలో కొలువై ఉంది.

మహా గౌరీ: ఎనిమిదోరోజు మహాగౌరి గా అవతారమెత్తిన ఈ అమ్మవారు.. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. పరమ శివుడిని భర్తగా పొందడం కోసం బాగా తపస్సుచేసిన అమ్మవారు. ఈ అమ్మవారు ఆలయం వారణాసిలో మరియు లుథియానాలో కూడా ఉంది.

సిద్ధిదాత్రి: ఇక తొమ్మిదవరోజు సిద్ధిదాత్రి అవతారములో అమ్మవారిని పూజిస్తారు. ఈమె శివుడి శరీరంలో అర్ధ భాగంలో నిలిచింది. ఈమె చతుర్భుజ అవతారం లో దర్శనమిస్తుంది. ఈ అమ్మ వారి ఆలయం వారణాసి, దేవ్ పహరి చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో సాత్నా తో పాటు సాగర్ లో కూడా కొలువై ఉంది

click me!