ఈ పూలతో పూజిస్తే.. మీ కోరికలు నెరవేరుతాయి..!

First Published Aug 30, 2021, 2:52 PM IST

రకరకాల రంగు, రంగు పూలతో దండ గుజ్జి దేవుడిని అలంకరిస్తాం. అంతేకాదు.. ఆ పూలను స్వామివారి పాదాల వద్ద ఉంచి.. నమస్కరించుకుంటాం. అయితే.. ఒక్కో దేవుడికి  ఒక్కో రకం పువ్వు అంటే.. ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందట. 

దేవుడి పూజలు పూలు తప్పనిసరి. పూజ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది పూలే. అసలు పూలు లేకుండా దేవుడికి పూజ చేయాలనే ఆలోచన రాదు. రకరకాల రంగు, రంగు పూలతో దండ గుజ్జి దేవుడిని అలంకరిస్తాం. అంతేకాదు.. ఆ పూలను స్వామివారి పాదాల వద్ద ఉంచి.. నమస్కరించుకుంటాం. అయితే.. ఒక్కో దేవుడికి  ఒక్కో రకం పువ్వు అంటే.. ప్రత్యేకమైన ఇష్టం ఉంటుందట. ఆ పూలతో పూజిస్తే.. వారికి మరింత ఇష్టమట. మరి ఎవరికి ఏ పూలు ఇష్టమో ఓసారి చూసేద్దామా..

1. ధతుర పుష్పం.. దీనినే ఉమ్మెత్త పువ్వు అని కూడా ఉంటారు. తెలుపు రంగులో కనిపించే  ఈ పువ్వు అంటే..  శివుడికి చాలా ఇష్టమట. పాల సముద్రం చిలికినప్పుడు విషయం వస్తే.. దానిని శివుడు తాగాడన్న విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచే శివుడికి ఈ పువ్వంటే ఇష్టం ఏర్పడిందట. దీనితో పూజితే.. శివుడు కచ్చితంగా కరుణిస్తాడని పెద్దలు చెబుతున్నారు.
 


2.ఎర్ర మందారం..

ఎర్రటి మందారపూలంటే.. కాళికా మాతకు చాలా ఇష్టమట. ఆ పూలతో పూజిస్తే.. అమ్మవారు సంతోషిస్తారట.  ఈ పూలు 108 తెచ్చి అమ్మవారిని పూజిస్టే.. ఎలాంటి కోరికైనా తీరుతుందట.
 

3.పారిజాత పుష్పం..

పురణాల్లో ఈ పేరుతో ఓ కథ కూడా ఉంది. అయితే.. ఈ పూలంటే విష్ణు మూర్తికి చాలా ఇష్టమట. వీటితో పూజిస్తే.. ఆయన చాలా సంతోషిస్తారు.
 

4. లోటస్( కమలం)

కమలం పూలంటే.. లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేయాలంటే.. ఆమెకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కమలం పూలతో పూజించాలట.
 

5.బంతి పువ్వు..
దేవులందరికీ ప్రథముడు, ఆథ్యుడు వినాయకుడు. ఏ పూజ చేయాలంటే.. ఆటంకాలు కలగకుండా ఉండేందుకు వినాయకుడికి పూజ చేస్తారు. అయితే.. ఈ వినాయకుడికి బంతి పూలంటే చాలా ఇష్టమట. బంతిపూల దండను వినాయకుడు ఎక్కువగా ఇష్టపడతాడట. ముఖ్యంగా ఎర్రటి బంతి లేదా.. ఆరెంజ్ కలర్ బంతి పూలు అంటే వినాయకుడు ఎక్కువగా ఇష్టపడతాడట,

6.పలాశ పువ్వు..

ఈ పువ్వు చాలా అరుదుగా  కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ పువ్వు అంటే సరస్వతీ దేవికి చాలా ఇష్టమట. ఈ పూలతో పూజించిన వారికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది. ఇది తెలివికి  చిహ్నంగా పరిగణిస్తారు.
 

7.తులసి..

ఈ తులసి మొక్కతో చేసిన పూల దండను శ్రీకృష్ణుడు ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే ఎక్కువగా కృష్ణుడకి తులసి మాలతో పూజ చేస్తూ ఉంటారు.

8. మల్లెపువ్వు..

ఈ పువ్వు ని ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టమట. ఆంజనేయ స్వామికి ఐదు మల్లెపూలు ఇచ్చి.. మీ కోరిక కోరుకుంటే.. అది జరుగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. 

click me!